#VD10 హీరోయిన్ ఎవరో తెలిసి పోయింది

0

విజయ్ దేవరకొండ 10వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నేడు ముంబయిలో లాంచనంగా ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను పూరి.. ఛార్మిలతో పాటు కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ భాగస్వామ్యం అవ్వడంతో సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగింది. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా మూవీ అంటే ఖచ్చితంగా హీరోయిన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ అయితేనే బాగుంటుంది. అందుకే విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వీ కపూర్ ను అనుకున్నారు.

జాన్వీ కపూర్ కోసం కరణ్ జోహార్ కూడా ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. కాని జాన్వీ కపూర్ ముందే ఇచ్చిన కమిట్స్ మెంట్స్ కారణంగా ఈ చిత్రంకు డేట్లు ఇవ్వలేక పోతుందట. విజయ్ దేవరకొండ అంటే అభిమానం ఉన్నా.. కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ లో నటించాలని ఉన్నా కూడా ఆమె నో చెప్పినట్లుగా తెలుస్తోంది. జాన్వీ కపూర్ కుదరక పోవడంతో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండేను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు పతీ పత్నీ ఔర్ ఓ చిత్రంతో సక్సెస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఖాలీ పీలి అనే చిత్రంలో నటిస్తుంది. ఇదే సమయంలో ఈ అమ్మడు విజయ్ దేవరకొండ మూవీకి కూడా ఓకే చెప్తుందా అనేది చర్చనీయాంశం. కరణ్ జోహార్ మూవీలో అంటే ఏ హీరోయిన్ కూడా ఛాన్స్ వదులుకోదు. మరి ఈ అమ్మడు కూడా ఖచ్చితంగా ఓకే చెప్తుందనే అంతా అంటున్నారు.




Please Read Disclaimer