ఆ పేరు ఉంటే చాలు కాసుల వర్షం

0

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన గత చిత్రం డియర్ కామ్రేడ్ నిరాశ పర్చినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘వరల్డ్ పేమస్ లవర్’ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోలు ఈమద్య నిర్మాతలుగా మారడం చాలా కామన్ అయ్యింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా నిర్మాతగా మారాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ఒక సినిమాను నిర్మించాడు.

నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీకు మాత్రమే చెప్తా ఒక చిన్న బడ్జెట్ సినిమా. కాని క్రేజ్ మాత్రం పెద్ద సినిమాల స్థాయిలో ఉంది. బిజినెస్ కూడా బాగా అయ్యింది. రౌడీ పెట్టిన పెట్టుబడికి రెండు రెట్లు విడుదలకు ముందే వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడు పోయిందంటున్నారు. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.

ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ స్టార్ మా వారు ఈ చిత్రం రైట్స్ ను దక్కించుకున్నారు. సినిమా బడ్జెట్ కు దాదాపుగా సమానమైన మొత్తం పెట్టి స్టార్ మా వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్.. శాటిలైట్ రైట్స్.. ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ఇలా అన్నింటికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమాలో నటించింది పెద్ద స్టార్స్ కాదు.. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు కూడా కాదు. అయినా కూడా ఈ సినిమాకు ఇంతగా బిజినెస్ అవ్వడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ.

ఒక నిర్మాతను చూసి బయ్యర్లు ఇంతగా పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. రౌడీ పేరు ఉంటే చాలు అదో బ్రాండ్ అన్నట్లుగా ప్రస్తుతం జనాలు చూస్తున్నారు. అందుకే అన్ని రైట్స్ కు కూడా రెక్కలు వచ్చాయి. ఈ చిత్రం విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండకు మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer