నెగటివ్ పబ్లిసిటీ గురించి విజయ్ దేవరకొండ

0

ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం అభిమానులనే కాదు హీరో విజయ్ దేవరకొండకూ ఊహించని షాక్ ఇచ్చింది. చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోట్ చేస్తే ఇలాంటి రిజల్ట్ రావడం ఎవరికైనా బాధే. అయితే సినిమా ఓ మాదిరిగా యావరేజ్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలో ఓ వర్గం పనిగట్టుకుని మరీ నెగటివ్ పబ్లిసిటీ ఇచ్చి దీన్ని డిజాస్టర్ వైపు తీసుకెళ్ళారని చెబుతున్న ఫ్యాన్స్ లేకపోలేదు.

ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవనేది కూడా మర్చిపోకూడదు. విజయ్ దేవరకొండ ఎదుగుదలను టార్గెట్ చేశారన్న వాళ్ళ ఆరోపణలు మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. దీని గురించి విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇదంతా తాను గమనిస్తున్నానని దురదృష్టవశాత్తు ఇలాంటి పోకడ తెలుగు పరిశ్రమలో ఉండటం విచారం కలిగిస్తోందని చెప్పాడు. వీటి నుంచి బయటికి వచ్చి అతీతంగా నిలిచే స్థాయికి తప్పకుండా చేరుకుంటానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

డియర్ కామ్రేడ్ ఫలితాన్ని అంగీకరించిన విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్న మూవీ మీదే ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన పూరితో చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించి ఫ్యాన్స్ కు ఈ రూపంలో మాస్ కిక్ ఇచ్చాడు. ఇప్పటిదాకా లవ్ ను బేస్ చేసుకున్న కథలతోనే వచ్చిన విజయ్ దేవరకొండకు పూరి సరికొత్త మాస్ ఇమేజ్ తెస్తాడని వాళ్ళ నమ్మకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Please Read Disclaimer