ముగ్గురు భామలతో విజయ్ రొమాన్స్?

0

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్ ను షేక్ చేసిన విజయ్…గీత గోవిందంతో నయా సూపర్ స్టార్ గా అవతరించాడు. ఆ రెండు వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న విజయ్ `నోటా`తో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో విజయ్ అప్ కమింగ్ మూవీస్ `ట్యాక్సీవాలా` -`డియర్ కామ్రేడ్`ల కోసం రౌడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రెండు సినిమాల తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఆ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా – ఐశ్వర్యా రాజేష్ లు ఎంపికయ్యారని గాసిప్స్ వచ్చాయి. అయితే తాజాగా ఆ సినిమాలో మరో హీరోయిన్ కూడా విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని తెలుస్తోంది.

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కేఎస్ రామారావు నిర్మించబోతోన్న ఆ చిత్రంలో విజయ్…ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్ వస్తోంది. రాశి ఖన్నా – ఐశ్వర్య రాజేశ్ లతో పాటు ఇజాబెల్లీలీట్ అనే బ్రెజీలియన్ మోడల్ కూడా విజయ్ సరసన నటిస్తోందట. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తోన్న ఈ అమ్మడు…తొలిసారిగా తెలుగులో తెరంగేట్రం చేయబోతోందట. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని లాంచ్ చేయబోతున్నారట. పూర్తి స్థాయి లవర్ బాయ్ గా విజయ్ దేవరకొండ ఏవిధంగా పర్ ఫార్మ్ చేస్తాడా అని రౌడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లవర్ బాయ్ విజయ్ ఎలా ఉంటాడో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer