ఆ విషయం అర్థమైందని చెప్తున్న విజయ్

0

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాకు యువ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. తన సినిమాల జయాపజయాలను పట్టించకోనని తెలిపాడు. అయితే తన సినిమా నిరాశపరిచినప్పుడు నెక్స్ట్ సినిమాతో ఎలా అయినా ప్రేక్షకులను మెప్పించాలనే పట్టుదల కలుగుతుందని తెలిపాడు.

తన సినిమాలు ఫెయిల్ అయినప్పుడు ఆ సినిమాలో ఎక్కడ పొరపాట్లు జరిగాయి అనే విషయంలో స్నేహితుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని వెల్లడించాడు. ఈమధ్య ‘డియర్ కామ్రేడ్’ చూసిన తర్వాత ఒక చిన్న పాప విజయ్ తో సినిమా ఎలా ఉందో చెప్పిందట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. కానీ సెకండ్ హాఫ్ తనకు ఏమాత్రం నచ్చలేదని విజయ్ తో చెప్పిందట. ఈ విషయం చెప్తూ విజయ్ ఇలాంటి నిజమైన విమర్శను స్వీకరిస్తానని తెలిపాడు.

సినిమా ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయని అన్నాడు. “సినిమా అనేది వ్యాపారం. డబ్బు ఉంటుంది.. ప్రచారం ఉంటుంది.. పవర్ ఉంటుంది.. ఎన్నో జరుగుతూ ఉంటాయి” అని చెప్పాడు. తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా తనకు నచ్చింది చేస్తూ పోతానని అనుకున్నాడట. కానీ కొంత సమయం గడిచిన తర్వాత ఇక్కడ ఉండాలంటే సక్సెస్ ఉండాల్సిందేననే విషయం అర్థం అయిందట. ఇదంతా బిజినెస్ అని.. అలా కాకుండా ఉంటే బాగుండేదని చెప్పాడు. “నా వరకూ నాకు సినిమా ఆడినా ఆడకపోయినా పెద్దగా పట్టించుకోను” అన్నాడు.
Please Read Disclaimer