లైఫ్ లో కొత్త దశ.. సరికొత్త మాటలు చెబుతున్న రౌడీ

0

నోట్లో నుంచి ఉత్తినే మాటలు రావు. మనసు లో జరిగే మధనానికి తగ్గట్లే కొన్ని మాటలు వస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ యూత్ ఐకాన్ కమ్ రౌడీ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి. లవర్ బాయ్ ఇమేజ్ తో యూత్ మనసు దోచేయటమే కాదు.. భారీ ఫ్యాన్ మొయిల్ ను సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవటం సామాన్యమైన విషయం కాదు. ఈ అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన విజయ్ దేవరకొండ తానిక ప్రేమ కథా చిత్రాలు చేయనని చెప్పటం ఓకే అయినా.. ఆ సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్ని చూసినప్పుడు.. అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనిపించక మానదు.

‘‘మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఏమై ఉంటాయా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ విజయ్ ఎంటర్ అయిన కొత్త దశ పర్సనలా? ప్రొఫెషనలా? అన్నది ఒక క్వశ్చన్ అయితే.. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ ఎందుకంత మొహం మొత్తిందన్నది మరో ప్రశ్నగా చెప్పక తప్పదు. ఏమైనా.. రౌడీ జీవితం లో కొత్త దశ ఏమిటన్న దానిపై రౌడీ కాస్తా క్లారిటీ ఇస్తే బాగుండు.