రౌడీ అంటే వాళ్లకు మోజు.. వాళ్లంటే రౌడీకి మోజు!

0

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే బహుభాషల్లో ఫాలోయింగ్ పెంచుకున్న రౌడీ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. `అర్జున్ రెడ్డి`.. `గీతగోవిందం` చిత్రాలు అందించిన విజయాలే అందుకు కారణం. ఆ సినిమాలు వచ్చి రెండు మూడేళ్ళు అవుతున్నా.. ఆ తర్వాత వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అయినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అది విజయ్ సత్తా అని చెప్పుకోవచ్చు. `అర్జున్ రెడ్డి` చిత్రంతో ఆయనకు బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అయితే ఈ రౌడీ బాయ్ కి బాలీవుడ్ లో ఇద్దరమ్మాయిలతో పనిచేయాలని బాగా కోరిక కలుగుతుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వారి పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ లో మీరు ఎవరితో కలిసి పనిచేయాలనుందని ప్రశ్నించగా ఆయన సమాధానమిస్తూ.. “ప్రత్యేకంగా ఒకరితో పనిచేయాలనే కోరిక లేదు. కాకపోతే నాకు ఛాయిస్ ఇచ్చి వీరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటావంటే మాత్రం కియరా అద్వానీ.. జాన్వీ కపూర్ పేర్లు చెబుతా. అయితే నా సినిమాల్లో హీరోయిన్ గా ఏ పరిశ్రమకి చెందిన హీరోయిన్ని పెట్టుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు“ అన్నాడు. విజయ్ ఏ స్టార్ హీరోయిన్లు దీపికా.. ప్రియాంక.. కత్రినా వంటి వారి పేర్లు చెబుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ యంగ్ బ్యూటీస్ పేర్లు చెప్పడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా వారిపై ఈ రౌడీ మనసు పడ్డాడేమో అని వెనక నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే విజయ్ ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇటీవల విజయ్- కియరా కలిసి ఓ దుస్తుల బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు. అందుకు కలిసి వీడియోలు.. ఫోటో షూట్ లు చేశారు. ఇక జాన్వీ కపూర్ ఇటీవల కరణ్ జోహార్ కాఫీ షోలో పాల్గొని విజయ్ అంటే ఇష్టమని తెలిపింది. ఈ కారణాల వల్లే విజయ్ ఈ సమాధానం చెప్పి ఉంటాడని సర్ధిచెప్పుకుంటున్నారంతా. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం`ఫైటర్`లో నటిస్తున్న విషయం విదితమే. ఇందులో అనన్యపాండే కథానాయికగా నటిస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-