క్యాంటీన్ తో కామ్రేడ్ జోష్

0

వచ్చే నెలాఖరున రానున్న డియర్ కామ్రేడ్ మీద ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ సినిమా వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డప్పటికీ ఫైనల్ గా మంచి సీజన్ లో డేట్ ని లాక్ చేసుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా దర్శకుడు భరత్ కమ్మకు హీరోకు సరిగా పొసగడం లేదని అందుకే వీటి వ్యవహారాలకు అతను దూరంగా ఉంటున్నాడని ఏవేవో పుకార్లు ప్రచారం చేశాయి.

వాటికి చెక్ పెట్టేందుకో లేక ప్రమోషన్ స్పీడ్ ని ఇంకాస్త పెంచేందుకో కానీ తాజాగా తన ఇన్స్ టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో నాలుగో ఆడియో సింగల్ ఏది రిలీజ్ చేయాలి అనే దాని గురించి టీమ్ చాలా సీరియస్ డిస్కషన్ లో ఉంది. దర్శకుడు భరత్ కమ్మ మెలోడీ సాంగ్ వైపే మొగ్గు చూపగా సుహాస్ ఇతర తారాగణం అందరూ కాకినాడలో తీసిన కాలేజీ సాంగ్ కావాలని డిమాండ్ చేశారు.

దానికి విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా మద్దతు తెలపడం ఫైనల్ గా ఓకే కావడం అంతా చకచకా జరిగిపోయింది. సరదాగా ఉన్న వాతావరణంలో భరత్ తో పాటు టీమ్ అంతా ఫుల్ జోష్ తో కనిపించారు. వీడియో చివర్లో కాలేజీ క్యాంపస్ అంటేనే ప్రేమ పక్షుల హెవెను అంటూ సాగే లీడ్ ని అన్ని బాషల్లోనూ వినిపించడం విశేషం. మొత్తానికి కామ్రేడ్ అల్లరి మాములుగా ఉండేలా కనిపించడం లేదు.