మరో కొత్త వ్యాపారం లోకి రౌడీ స్టార్

0

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతని నవతరం స్టార్లు ఏమాత్రం మొహమాట పడకుండా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ సూత్రాన్ని పాటించడం తప్పనిసరి. లేదంటే స్టార్డమ్ మాయలో పడి ఆ తరువాత ఉన్నదంతా కోల్పోయి .. నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు ఎందరో నవతరానికి ఒక పాఠం. నాటితరం నటీనటులకు భిన్నంగా నేటి యంగ్ స్టర్స్ ఆలోచిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్ వైపు అడుగులు వేస్తూ అక్కడా తనదైన ముద్ర తో ముందుకు సాగుతున్నారు.

టాలీవుడ్ లో రౌడీ బ్రాండ్ గురించి తెలిసిందే. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా ఎదిగాడు విజయ్. అయన క్రేజ్ ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాలేదు. అటు కోలీవుడ్ -బాలీవుడ్ లోకూడా అదే క్రేజ్. ఈ క్రేజునే అతడు తెలివిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. విజయ్ ఓవైపు హీరోగా సినిమాలు చేసుకుంటూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే రౌడీ పేరుతొ సొంతంగా క్లాత్స్ బ్రాండ్ క్రియేట్ చేసి సక్సెస్ అందుకున్న విజయ్ తాజాగా మల్టిప్లెక్స్ బిజినెస్ లో ప్రవేశిస్తున్నాడని తెలుస్తోంది.

ఈ రంగంలో ఇప్పటికే మహేష్ బాబు- ప్రభాస్ లాంటి హీరోలు సక్సెస్ ఫుల్ గా అడుగులు వేసిన నేపథ్యంలో విజయ్ కూడా మల్టి ప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్నాడట. డిస్ట్రిబ్యూషన్ రంగంలో టైకూన్ గా పేరొందిన ఏషియన్ సినిమాస్ తో అయన చేతులు కలిపారు. తాజాగా విజయ్ హోమ్ టౌన్ మహబూబ్ నగర్ లో ఈ మల్టీ ప్లెక్స్ ని నిర్మిస్తున్నాడట. ఏవీడీ పేరుతొ మూడు స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్ నిర్మాణం చెప్పట్టాడని.. ఇప్పటికే నిర్మాణం మొదలైంది కాబట్టి .. వచ్చే సమ్మర్ నాటికి దాన్ని పూర్తి చేయాలన్న పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. దీంతో పాటు పూరి జగన్నాథ్ తో `ఫైటర్` సినిమా చేస్తున్నాడు విజయ్.
Please Read Disclaimer