కామ్రేడ్ తో రాఖీ భాయ్ – ఫోటో టాక్

0

ఒకరేమో టాలీవుడ్ సెన్సేషన్. మరొకరేమో శాండల్ వుడ్ ఫైర్ బ్రాండ్. ఇద్దరూ ఒకేచోట కలిస్తే ఇంకేమైనా ఉందా. అభిమానులకు కనులవిందే. డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ దానికి అవకాశం ఇచ్చింది. ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల కానున్న డియర్ కామ్రేడ్ కన్నడ ట్రైలర్ లాంచ్ కు బెంగుళూరులో ముఖ్య అతిధిగా కెజిఎఫ్ రాఖీ భాయ్ యష్ విచ్చేశాడు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అల్లరితో వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత కూడా విజయ్ దేవరకొండ యాష్ లు పర్సనల్ గా కలుసుకుని చాలా ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఒకే కలర్ టి షర్ట్ తో యాష్ తో తీసుకున్న పిక్ ని స్పెషల్ గా పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇద్దరు గుబురు గెడ్డాలతో యూత్ ఐకాన్స్ గా స్మైల్ ఇవ్వడం బాగా వైరల్ అవుతోంది. డియర్ కామ్రేడ్ ఈ నెల 26న తెలుగుతో పాటు కన్నడ లోనూ డబ్బింగ్ వెర్షన్ రూపంలో విడుదల అవుతోంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు రెట్టింపు అయ్యాయి. రష్మిక మందన్న హీరోయిన్ కావడంతో కర్ణాటకలో హైప్ ఇంకాస్త పెరుగుతోంది.

దీని దెబ్బకు సౌత్ లో తన మార్కెట్ నిబలంగా పెంచుకునే ప్లాన్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. యాష్ తో మీట్ సందర్భంగా తమ ఎమోషన్స్ ని ఇద్దరం షేర్ చేసుకున్నామని చెప్పి అవేంటో మాత్రం చెప్పలేదు. కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాదికి విడుదల చేయనున్నారు. ఆలోగా విజయ్ దేవరకొండవి ఎంత లేదన్నా నాలుగు సినిమాల దాకా వచ్చేలా ఉన్నాయి.
Please Read Disclaimer