అన్ని చోట్లా కామ్రేడ్ కు షాకే!

0

విడుదల ముందు వరకు భారీ అంచనాలతో యూత్ సపోర్ట్ తో వచ్చిన డియర్ కామ్రేడ్ స్టేటస్ కు సంబంధించి ఎట్టకేలకు క్లారిటీ వస్తోంది. మొదటి షో నుంచే మొదలైన డివైడ్ టాక్ ఏ రకంగానూ పాజిటివ్ టాక్ గా మారకపోవడం వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కేవలం గీత గోవిందం తెచ్చిన కలెక్షన్స్ చూసుకుని ఇదీ అదే రేంజ్ లో ఆడుతుందనే అంచనాలో యుఎస్ డిస్ట్రిబ్యూటర్ దీనిని భారీ ఆఫర్ ఇచ్చి కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఏ హీరో అయినా అతని మార్కెట్ పొటెన్షియాలిటీని బట్టి సినిమాను కొనాలే తప్ప గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ప్రతిదానికీ వస్తుందని ఆశించడం అత్యాశే. అలా వేసిన లెక్కల వల్లే డియర్ కామ్రేడ్ ఇప్పుడు నష్టాలు మిగిల్చే దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. వీకెండ్ పూర్తయినా కామ్రేడ్ మిలియన్ మార్క్ చేరుకోలేదు. ఇవాళ వీక్ డేస్ మొదలయ్యాయి కనుక డ్రాప్ ఉంటుంది. వచ్చే వారాంతానికి కొత్త సినిమాలు వచ్చేస్తాయి కాబట్టి పికప్ కోరుకోవడం ఊహకే పరిమితం.

అక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంత గొప్పగా ఏమి లేదు. హాలిడేస్ కాబట్టి నిన్న రెండు రోజులు ఓ మాదిరిగా వచ్చాయి కానీ అసలైన ఛాలెంజ్ ఇవాళ్టి నుంచి ఉంది. ఇక డబ్బింగ్ వెర్షన్లో కన్నడ-తమిళ్-మలయాళంలో రిలీజ్ చేస్తే అక్కడ ఆడియన్స్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు. షేర్ ఎంత వచ్చిందో చెప్పుకోవడానికి కూడా యూనిట్ ఇష్టపడటం లేదు. విజయ్ దేవరకొండకు చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడీ డియర్ కామ్రేడ్ రిజల్ట్ ద్వారా మన ప్రేక్షకులే కాదు పక్క రాష్ట్రాల ఆడియన్స్ కూడా ఇచ్చేశారు
Please Read Disclaimer