ఇంతకీ ఫైటర్ కథ ఇదేనా?

0

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ కాంబోలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా అంచనాలు మాత్రం అప్పుడే మొదలైపోయాయి. అందులోనూ టైటిల్ ఫైటర్ అని గా లీక్స్ రావడంతో అవి పీక్స్ కు చేరిపోయాయి. మాస్ మసాలాలతో విజయ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని అభిమానులు అప్పుడే ఏవేవో ఊహించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తాడనే లీక్ బలంగా వినిపిస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా బలంగా ఉంటుందని పూరి మార్క్ హీరోయిజంతో పాటు కావాల్సినంత ఎమోషన్ ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఇదే తరహాలో గతంలో రవితేజతో పూరి అమ్మానాన్న తమిళ అమ్మాయి చేశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలవడంలో సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా బలమైన పాత్ర పోషించింది. అదే తరహాలో ఫైటర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు టెక్నీకల్ టీమ్ ని సెట్ చేసుకోవడంతో పాటు స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దటంతో పూరి యూనిట్ బిజీగా ఉందని సమాచారం. నిజానికి పూరి తన శైలిలో ఎమోషన్ ని యాక్షన్ ని మిక్స్ చేసి సినిమాలు తీసి చాలా కాలమయ్యింది.

ఇస్మార్ట్ శంకర్ లో సైతం కావాల్సినన్ని మాస్ అంశాలు ఉన్నాయి సున్నితమైన భావోద్వేగాలు లేవు. అందుకే ఫైటర్ లో అన్ని సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట పూరి. మొత్తానికి పూరి చాలా కాలం తర్వాత పూరి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకోవడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కొడితే మాత్రం పూరిని ఆపడం కష్టమే. షూటింగ్ త్వరలోనే ప్రారంభించబోతున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home