పూరి – విజయ్.. ఏం చేస్తున్నారబ్బా?

0

సక్సెస్.. ఫ్లాపులు పక్కన పెడితే ఒక సినిమాను అతి తక్కువ సమయంలో సెట్ చేసుకోవడం.. వీలైనంత టైట్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేయడం.. ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడంలో పూరి జగన్నాధ్ ను మించిన వారు లేరు. ఫ్లాపులు సక్సెస్ ల విషయం మాట్లాడుకుంటే.. రెండేళ్ళు సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని గ్యారెంటీ ఏమైనా ఉందా? కంటెంట్ ముఖ్యం కానీ టైమ్ కాదు. అందుకే పూరి స్టైల్ లో లేని ఈ జెనరేషన్ టాప్ డైరెక్టర్స్ చాలామందికి సినిమాకు సినిమాకు మధ్య ఏళ్ళ తరబడి గ్యాప్ వస్తోంది.

కానీ పూరి మాత్రం తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ తో సూపర్ హిట్ సాధించిన పూరి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా విజయ్ దేవరకొండతో ఒక ప్రాజెక్టును ఫైనలైజ్ చేసుకున్నాడు. అంతే కాదు.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పిక్ లో విజయ్ దేవరకొండతో పాటుగా పూరి జగన్నాధ్ కూడా ఉన్నారు. తమ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ లోకేషన్స్ కోసం వేట మొదలుపెట్టారని.. ఈ ఫోటోను చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే లోకేషన్స్ కోసం వేటా.. లేక స్క్రిప్ట్ చర్చల్లో భాగంగా విజయ్ షూటింగ్ లొకేషన్ కు పూరి వెళ్ళడం జరిగిందా అనేది తెలియదు.

ఏదేమైనా పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పూరి తన సినిమాల్లో హీరోకు అద్భుతమైన మేకోవర్ ఇస్తారు. విజయ్ టాలెంటెడ్ యాక్టర్ కాబట్టి ఈసారి విజయ్ కి ఎలాంటి మేకోవర్ ఉంటుందో అనే చర్చలు ఆల్రెడీ మొదలయ్యాయి.
Please Read Disclaimer