ఫేమస్ లవర్ నాలుగో లవ్ స్టోరి

0

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజవుతోంది. ఈ సినిమాకి విలక్షణ పంథాలో ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ ముగ్గురు గాళ్ ఫ్రెండ్స్ ని ఆడియెన్ కి పరిచయం చేశారు. ఐశ్వర్యా రాజేష్ అతడికి భార్య పాత్రలో కనిపిస్తుండగా.. ఇజబెల్లె- కేథరిన్ గాళ్ ఫ్రెండ్స్ గా కనిపించనున్నారు. ఆ ముగ్గురికి సంబంధించిన ఇంటెన్స్ పోస్టర్లను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ లోకి వైరల్ గా దూసుకెళ్లాయి.

తాజాగా రాశీఖన్నాతో ఫేమస్ లవర్ రొమాన్స్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. రాశీతో లవర్ బోయ్ ప్రేమకబుర్లతో చిలౌట్ చేస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు.గౌతమ్ – యామిని జంట లవ్ స్టోరీకి సంబంధించిన పోస్టర్ ఇది. నలుగురు భామలతో నాలుగు ప్రేమకథల్ని నాలుగు పోస్టర్ల రూపంలో రిలీజ్ చేశారు. ఇక ఈ నాలుగు ప్రేమకథలకు కనెక్షన్ ఏమిటి? అన్నది తెరపై చూడాల్సిందే.

క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. కే.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి క్లాసిక్ ప్రేమకథను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈసారి సెన్సిటివ్ ప్రేమకథల్ని తెరపై ఆవిష్కరిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కంటెంట్ పరంగా గ్రిప్ ఎంత..? స్క్రీన్ ప్లేలో కొత్తదనం ఏమేరకు చూపిస్తారు అన్నది కీలకంగా మారింది. జనవరి 3న టీజర్ రిలీజవుతోంది. ఏపీ – తెలంగాణలో సమీపంలోని థియేటర్లలో ఈ టీజర్ ని వీక్షించండి అంటూ చిత్రబృందం ప్రకటించింది.
Please Read Disclaimer