రౌడీకి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పేశాడుగా!

0

తక్కువ వ్యవధిలో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవటమే కాదు.. యూత్ ఐకాన్ గా మారి.. రౌడీ ఇమేజ్ తో మనసుల్ని దోచేస్తున్న విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో హడావుడి చేశారు. తాను ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కోసం వచ్చిన అతగాడు.. బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లకు మాత్రం భారీ ఆనందాన్ని మిగిల్చాడు.

చప్పగా సాగిపోతున్న బిగ్ బాస్ హౌస్ కు రౌడీ పుణ్యమా అని కొత్త కళ దీపావళి రోజున వచ్చిందని చెప్పాలి. సరదాగా సాగిన విజయ్ దేవరకొండను బుల్లితెర మీద చూసినప్పుడు.. సినిమాల్లో మాదిరే రియల్ లోనూ చాలా సందర్భాల్లో తన బాడీలాంగ్వేజ్ ఉండటం కనిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెళ్లి ముచ్చట వచ్చి నాగ్ అడిగిన ప్రశ్నకు ఊహించని రీతిలో సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. వైఫ్ లేకుండా ఎలా ఉంటున్నావ్ విజయ్ అంటూ వరుణ్ ను ఆట పట్టించారు. నీ పెళ్లి గురించి ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉంటాయి.. మరి నీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావన్న నాగ్ ప్రశ్నకు స్పందిస్తూ.. ఇంకా నా అమల దొరకలేదంటూ సరదాగా కౌంటర్ ఇచ్చాడు.

మరోసారి సైతం అమల ప్రస్తావన తేవటం ద్వారా.. క్యూట్ అండ్ హోమ్లీ వైఫ్ కావాలన్న సందేశాన్ని ఇచ్చాడా? అన్నది ప్రశ్నగా మారింది. అదే టైంలో నాగ్ కు అమల ఎలానో.. తనకు అలాంటి ఐడియల్ సోల్ మేట్ కావాలన్నది విజయ్ దేవరకొండ మాటగా చెప్పక తప్పదు. మరి.. రౌడీ మనసు దోచేసే ఆ అమల ఎవరో? ఎక్కడ ఉందో..?