విమానాశ్రయంలో కామ్రేడ్ ఏంటిలా?

0

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ అంతా ఇంతా కాదు. డియర్ కామ్రేడ్ నిరాశపరిచినా ఈ రౌడీ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడికి వెళ్లినా.. అతడు అనుసరిస్తున్న స్టైల్ ఎంతో విభిన్నంగా కనిపిస్తోంది. ఇతర హీరోలతో పోలిస్తే తనకంటూ ఓ యూనిక్ స్టైల్ ఉందని ప్రూవ్ అవుతోంది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ ప్రచారం కోసం మెట్రోల్ని చుట్టి వచ్చినప్పుడు ప్రతిసారీ డిఫరెంట్ డ్రెస్సింగ్ సెన్స్ తో ఆకట్టుకున్నాడు. వెండితెరపైనా తనకు నచ్చినట్టు డ్రెస్ చేసుకుని తనకు తోచినట్టుగా వుండే ఈ యువ సంచలనం తన సహజ సిద్ధమైన స్టైల్ తో రియల్ లైఫ్ లోనూ.. రీల్ లైఫ్ లోనూ మురిపిస్తున్నాడు. తన యాటిట్యూడ్ తో ఫ్యాన్స్ ని స్టార్స్ ని ఇంప్రెస్ చేస్తూనే వున్నాడు. బాలీవుడ్ లోనూ `అర్జున్ రెడ్డి` రీమేక్ తో పాపులర్ అయినా ఈ క్రేజీ హీరో తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లోనూ తన స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషం.

సైమా అవార్డ్స్ కోసం హైదరాబాద్ నుంచి ఖతార్ వెళ్లిన కామ్రేడ్ ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ క్యాజువల్ డ్రెస్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. తన ఆల్ టైమ్ ఫేవరేట్ గ్రే అండ్ బ్లూ డ్రెస్ లో సింపుల్గా కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు తమ మూడో కంటికి పని చెప్పారు. వరుస స్నాప్లతో పండగ చేసుకున్నారు. బ్లూ షర్ట్ గ్రే పాంట్తో విజయ్ దేవరకొండ ఏయిర్పోర్ట్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధంలేకుండా రౌడీ హీరో క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతుండటం టాలీవుడ్ స్టార్ హీరోలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఇదే హుషారులో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మైత్రి సంస్థలోనే హీరో అనే చిత్రం చేస్తున్నాడు. తదుపరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer