అబ్బే.. ఇదేం డ్యాన్సు జూనియర్ రౌడీ?

0

టాలీవుడ్ లో హీరోగా.. హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు నటన సంగతి ఎలా ఉన్నా డ్యాన్స్ ఫైట్స్ నేర్చుకోవడం మినిమం రిక్వైర్ మెంట్. అయితే డ్యాన్స్ విషయంలో టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ముద్దుల తమ్ముడు ఆనంద్ దేవరకొండ అందరికీ కలిపి టోకున షాక్ ఇచ్చేలా ఉన్నాడు. దీనికి శాంపిల్ అన్నట్టుగా ఒక వీడియోను తాజాగా డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

‘కల్కి’ సినిమానుంచి ఈమధ్య ‘హార్న్ ఒకే ప్లీజ్’ అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది కదా. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆనంద్ దేవరకొండ.. శివాత్మిక కలిసి హుక్ అప్ స్టెప్ వేయడం జరిగింది. ఈ ఇద్దరూ త్వరలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరూ కలిసి జోడీగా హార్న్ ఒకే ప్లీజ్ స్టెప్ వేశారు. శివాత్మిక మంచి ఈజ్ తో.. ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ తో స్టెప్పులు వేసింది కానీ ఆనంద్ కు డ్యాన్స్ పెద్దగా రాదనే విషయం బైటపడిపోయింది. జస్ట్ వన్ మినిట్ మాత్రమే ఉన్న వీడియో క్లిప్ చూసి ఆనంద్ ను జడ్జ్ చేయడం సరి కాదేమో కానీ నెటిజనులు మాత్రం ఆనంద్ డ్యాన్స్ కు కాస్త షాక్ అయ్యారు. విజయ్ దేవరకొండ తమ్ముడు అనగానే మరి వారి అంచనాలు అలా ఉన్నాయి మరి!

ఇదిలా ఉంటే ‘దొరసాని’ సినిమాను ఎందుకో విజయ్ దేవరకొండ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ఇంత వరకూ ‘దొరసాని’ ట్రైలర్ ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో ‘సాహో’.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాలపై మాత్రం స్పందించాడు.