మెగా ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్!

0

మెగా డాటర్ నిహారిక తాజాచిత్రం ‘సూర్యకాంతం’ త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిహారిక.. హీరో రాహుల్ విజయ్ లు కాలేజీలకు వెళ్తూ అక్కడ స్టూడెంట్స్ ను కలుస్తూ తమ సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. సినిమా రిలీజ్ ఇక వారం రోజులే ఉండడంతో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫిక్స్ అయింది.

రేపు సాయంత్రం ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిపేందుకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరో కాదు.. టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. మెగా ఫ్యామిలీకి విజయ్ దేవరకొండ కాస్త సన్నిహితంగా మెలుగుతాడని తెలిసిందే. జీఎ2 బ్యానర్ లో ‘గీత గోవిందం’.. ‘ట్యాక్సీవాలా’ సినిమాలను చేయడంతో మెగా ఫ్యామిలీతో టచ్ ఏర్పడింది. అందుకే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడని సమాచారం. రౌడీగారి రాకతో ఈ కార్యక్రమం మరింత ఆసక్తికరంగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సుహాసిని ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తోంది. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రణీత్ బీ. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్యకాంతం’ చిత్రాన్ని సృజన్ సందీప్ లు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చ్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer