రౌడీ క్రిస్మస్ కానుకలు రెడీ..మీకేం కావాలి?

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. తాను నటంచే సినిమాల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంటాడు. నేటి తరం హీరోలలో తన ప్రచార శైలి అందరి కంటే భిన్నంగా ఉంటుంది. నలుగురు వెళ్లే దారిలో వెళ్లడు. తన దారి ప్రత్యేకంగా వెతుకుతాడు డిఫరెంట్ ఐడియాలజీకి తోడు లక్కు కలిసొచ్చింది కాబట్టే తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ అయ్యాడు. తాజాగా నేడు ప్రపంచదేశాలన్ని క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయాయి. దీంతో రౌడీ స్టార్ శాంటాగా మారిపోయాడు. తనకు నచ్చిన బహుమతులు సంగతి అటుంచి… అభిమానులకు నచ్చిన బహుమతులిచ్చి ఎక్కువ సంతృప్తి పరచాలని నిర్ణయించాడు.

అందుకే దేవరశాంటా అనే హ్యాష్ ట్యాగ్ తో మీకందరికి ఏం కావాలో చెప్పాలి! అంటూ ప్రకటన ఇచ్చాడు. అభిమానుల కోరికల చిట్టా నుంచి కొన్నింటిని ఎంపిక చేసి వాళ్లకి క్రిస్మస్ కానుకగా పంపిస్తానన్నాడు. రౌడీ స్టార్ లేటుగా స్పందించినప్పటికీ రెస్పాన్స్ మాత్రం బాగానే ఉంది. విజయ్ క్రేజ్ నేపథ్యంలో అతని ఫాలో వర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటంతోనే మంచి స్పందన వస్తోంది. విజయ్ డై హార్డ్ అభిమానులు తమకు ఎలాంటి బహుమతులు అవసరం లేదు కానీ..ఒక్కసారి కాల్ చేసి మాట్లాడితే చాలంటున్నారు. ఇంకొంత మంది సామాజిక కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని సూచించారు.

ఇక బహుమతులంటే ఇష్టపడే వారంతా బ్రాండె డ్ గిప్స్ట్ అడుగుతున్నారు. మరి వీళ్లందరిలో దేవరకొండ ఎంత మంది కోరికలు తీరుస్తాడో చూడాలి. గత రెండేళ్లుగా విజయ్ ఈ పద్దతిలో అభిమానుల కోరికలు తీరుస్తున్నాడు. కాకపోతే ఈసారి ఇంకొంచెం స్పెషల్ గా ప్లాన్ చేసాడు. ఇక విజయ్ ప్రోఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే కెరీర్ పరంగా పుల్ స్పీడ్ లో ఉన్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటించనున్నాడు. ఇంకొన్ని కమిట్ మెంట్లు కెరీర్ లో ఉన్నాయి.
Please Read Disclaimer