నాకు నచ్చిందే చేస్తూ వచ్చానంటున్న దేవరకొండ

0

ఆదివారం నాడు జరిగిన టీవీ9 నవ నక్షత్ర సన్మానం కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులకు అవార్డులు అందజేశారు. సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఇక నవ నక్షత్రాలలో ఒకరిగా యువ హీరో విజయ్ దేవరకొండ కు అవార్డు ఇచ్చారు. ఈ అవార్డును తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా విజయ్ అందుకున్నాడు.

ఈ సందర్భంగా విజయ్ ఇచ్చిన స్పీచ్ కాస్త ఫన్నీగా సాగింది. తనదైన శైలిలో చమత్కారంగా మాట్లాడుతూనే ప్రేరణ ఇచ్చే విధంగా కూడా మాట్లాడాడు. అవార్డు స్వీకరించిన తర్వాత “ఇక్కడ ఉన్న పెద్దలందరికీ.. రామేశ్వర రావు గారికి.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి నమస్కారం. ఫస్ట్ టైం నా లైఫ్ లో చాలా చిన్నవాడిలాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ అందరూ సూపర్ స్టార్స్ ఉన్నారు. నా ఫేవరెట్ హీరోలు ఉన్నారు.. నిర్మాతలు ఉన్నారు.. వ్యాపారవేత్తలు.. ఉన్నారు. ఇతర రంగాలలో ఎంతో సాధించినవారు కూడా ఉన్నారు. వీరందరి గురించి వీడియోలు చూస్తుంటే నెమ్మదిలా అలా లేచి వెళ్లిపోవాలని అనిపించింది.. కానీ ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ ఉంది. అందుకే మాట్లాడేసి వెళ్లి పోదామని వచ్చాను” అంటూ నవ్వులు పూయించాడు.

చిన్నప్పటి నుంచి తను ఒకటే నమ్మేవాడినని.. తనకు నచ్చింది నేను చేస్తూ వచ్చానని తెలిపాడు. “నేను చిన్నప్పుడు ఒకటి చదివాను.. మీరు ఎక్స్ ట్రా ఆర్డినరీ కావాలంటే ఆర్డినరీ జనాలు ఏం చేస్తారో వారికంటే ఎక్స్ ట్రా చేయాలని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను. అందరూ ఆరుకు లేస్తే మనం ఐదుకు లేచి పని చెయ్యాలి. వాడు కిలోమీటర్ ఉరికితే మనం ఒకటిన్నార కిలో మీటర్ ఉరకడానికి రెడీ ఉండాలి. ఇదొక్కటే నేను బ్లైండ్ గా ఫాలో అయ్యేది” అంటూ యూత్ కు ప్రేరణనిచ్చే అంశాలు కూడా ప్రస్తావించాడు. తను ఎంతగానో అభిమానించే సిఎమ్ కేసిఆర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఒక మరిచిపోలేని జ్ఞాపకం అని చెప్పాడు. ఇలాంటి అవకాశం కల్పించిన టీవీ9 వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
Please Read Disclaimer