ఫ్లాప్ మూవీకి అవార్డ్ అందుకున్న రౌడీ

0

విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళం.. కన్నడం.. మలయాళంలో కూడా విడుదల అయ్యింది. ఒకే సారి నాలుగు భాషల్లో విడుదల అయిన చిత్రాల జాబితాలో ఈ చిత్రం అయితే చేరింది. కాని కలెక్షన్స్ విషయంలో తీవ్ర నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా తమిళం.. కన్నడంలో ఈ సినిమా కలెక్షన్స్ కనీసం ప్రమోషన్ ఖర్చుల వరకు కూడా రాలేదని కామెంట్స్ వచ్చాయి.

‘అర్జున్ రెడ్డి’ రేంజ్ లో ఆడుతుందని ఆశిస్తే ఫ్లాప్ గా నిలిచింది. గీత గోవిందం చిత్రంలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న జంట ఈ సినిమాలో నటించారు. అయినా కూడా ప్రేక్షకులు ఆధరించలేదు. ప్రేక్షకులు సినిమాను ఆధరించకున్నా కూడా విజయ్ దేవరకొండకు ఒక అవార్డు ఈ సినిమాకు గాను రావడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మంచి నటనతో ఆకట్టుకున్నాడంటూ బిహైండ్ వూడ్స్ గోల్డ్ మెడల్స్ వారు అవార్డు ఇచ్చారు.

గత 7 సంవత్సరాలుగా బిహైండ్ వూడ్స్ గోల్డ్ మెడల్స్ వారు ఈ అవార్డులను ఇస్తున్నారు. తెలుగుకు గాను ఈసారి విజయ్ దేవరకొండ ఈ అవార్డు దక్కించుకున్నాడు. విజయ్ దేవరకొండకు ఈ అవార్డును కేజీఎఫ్ స్టార్ యశ్ అందించాడు. ఈ అవార్డు కార్యక్రమం చెన్నైలోని ఒక భారీ ఎత్తున జరిగింది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకు సిద్దం అవుతుంది.
Please Read Disclaimer