‘హీరో’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

0

ఆ మధ్య ఆనంద్ అన్నామలై అనే తమిళ దర్శకుడితో ‘హీరో’ సినిమా స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఆ సినిమాకు సంబంధించి ఢిల్లీలో ఒక షెడ్యూల్ కూడా జరిగింది. ఆ షెడ్యూల్ కి కోటి పైనే ఖర్చు పెట్టారు నిర్మాతలు.

అయితే మొదటి షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా ఆగిపోయిందనే టాక్ స్ప్రెడ్ అయింది. దాంతో మీడియాలో విజయ్ హీరో సినిమాకు బ్రేక్ అంటూ కథనాలు వచ్చేసాయి. కట్ చేస్తే నిర్మాతలు సినిమా ఆగలేదని త్వరలోనే రెండో షెడ్యూల్ ఉంటుందని చెప్పుకున్నారు.

అయితే అప్పటి నుండి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. ఇక లేటెస్ట్ గా విజయ్ ఈ సినిమా ఆగిపోయిందనే వార్తపై స్పందించాడు. సినిమా ఆగిపోలేదని త్వరలోనే రెండో షెడ్యూల్ ఉంటుందని పూరి గారి సినిమా తర్వాత హీరో మళ్లీ సెట్స్ పైకి వస్తుందని ఘంటాపథంగా చెప్పాడు. సో విజయ్ ‘హీరో’ మళ్లీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉండన్నమాట.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home