రౌడీ క్యారెక్టర్..స్టార్ డైరెక్టర్ సినిమాకు ప్రమోషన్!

0

రెండు రోజుల్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేసాడు. అందులో సీనయ్య తన ఫేవరేట్ అంటున్నాడు. ఆ క్యారెక్టర్ చేయడానికి ఎగ్జైట్ అయ్యానని చెప్పుకున్నాడు. సినిమాలో సువర్ణ -సీనయ్య ల మధ్య ఓ లవ్ ట్రాక్ ఉంది. సో ఆ ట్రాక్ లో సీనయ్య డైలాగ్స్ తో క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అవుతుందనే నమ్మకంలో ఉన్నాడు.

అయితే ఈ సినిమాలో విజయ్ చేసిన రోల్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ వినాయక్ సినిమాకు కలిసోచ్చేలా ఉంది. వినాయక్ హీరోగా మారి ‘సీనయ్య’ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. సో అప్పటికే విజయ్ సీనయ్య అనే పేరు తో జోనర్ లోకి వెళ్తున్నారు.

ఈ లెక్కన చూస్తే వినాయక్ కి సినిమా టైటిల్ ను తన క్యారెక్టర్ తో పాపులర్ చేయబోతున్నాడు విజయ్. వినాయక్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాతో నరసింహ రావు దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించి తన బ్యానర్ ను స్థాపించిన వినాయక్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడు.
Please Read Disclaimer