విజయ్ కి కావాల్సింది పూరి ఇస్తాడేమో

0

ప్రతి సినిమాకి సత్తా చాటాల్సిందే. ఫ్లాపు అన్నదే లేకుండా హిట్టు కొడితేనే నెక్ట్స్ ఛాన్స్ ఉంటుంది. లేదంటే పరిశ్రమలో మనుగడ సాగించడం చాలా కష్టం. కోట్లాది రూపాయల బిజినెస్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి హీరోపై పాజిటివిటీ చాలా ఇంపార్టెంట్. అయితే ఫ్లాపులొచ్చినా నిలదొక్కుకునేంత పాజిటివిటీ రౌడీ విజయ్ దేవరకొండ విషయంలో సాధ్యమైంది. పెళ్లి చూపులు- అర్జున్ రెడ్డి- గీత గోవిందం చిత్రాలు సాధించిన విజయం రౌడీకి గొప్ప మైలేజ్ ఇచ్చాయనే చెప్పాలి.

లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిసప్పాయింట్ మెంట్ అన్న చర్చ సాగుతోంది. ఇది ట్రేడ్ లో మరీ అంత మంచిది కాదు. హిట్టును మాత్రమే నమ్మే పరిశ్రమ ఇది. అందుకే విజయ్ కి వెంటనే హిట్టు కావాలి. అయితే అది డాషింగ్ డైరెక్టర్ పూరి ఇస్తారా? ఫైటర్ తో అది సాధ్యమేనా? అంటే ఇప్పటికి సస్పెన్స్.

రౌడీని పాన్ ఇండియా స్టార్ ని చేయాలని.. బ్లాక్ బస్టర్ కొట్టాలని పూరి- చార్మి బృందం సర్వసన్నాహకాల్లో ఉన్నారు. ఫైటర్ చిత్రం కాన్వాసును ముంబైలో సెట్ చేసి సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారు. దేవరకొండ సహా కీలక తారాగణంపై ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. ఇంతకుముందు విజయ్ – పూరి- చార్మి టీమ్ ముంబై విజిట్ కి సంబంధించిన ఫోటోలు రివీలైన సంగతి తెలిసిందే. అలాగే మూవీ ప్రారంభానికి ముందే విజయ్ నెలరోజుల పాటు అవసరం మేర బాక్సింగ్ సహా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేశాడు. కఠిన వ్యాయామంతో బాడీని షేపప్ చేశాడు. హెయిర్ స్టైల్ ని మార్చాడు. ఈ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. తాజాగా కళాదర్శకుడు జానీ బర్త్ డే సందర్భంగా ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇది రౌడీ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. తెలుగు-తమిళం- హిందీలో బహుభాషా చిత్రంగా రూపొందుతున్న `ఫైటర్` చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరణ్ తో కలిసి డాషింగ్ పూరి రౌడీ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తాడా? అన్నది చూడాలి. విజయ్ కి కావాల్సినది పూరి ఇస్తాడా లేదా? ఇప్పుడే గెస్ చేయలేం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-