కామ్రేడ్ కూల్ స్టూడెంట్

0

కామ్రేడ్ అంటేనే గడబిడ. నిరంతరం ఏదో ఒక మీటింగ్ అంటూ విప్లవ ప్రసంగాలు వినాల్సి ఉంటుంది. కాలేజ్ రోజుల్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ ఎఫ్) యాక్టివిస్టులు బంద్ లు .. ధర్నాలు అంటూ ఎంతో హడావుడి చేస్తుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న కామ్రేడ్ తీరుతెన్నులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎంతో సాఫ్ట్ గా కనిపిస్తూ గళ్ల చొక్కాలో బుద్ధిమంతుడిలాగా కనిపిస్తున్నాడు.

అయితే కామ్రేడ్ అసలు స్వరూపం ఏమిటి? అన్నది ఈ గురువారం ఉదయం 11గం.ల 11 నిమిషాలకు రివీల్ కానుంది. విజయ్ దేవరకొండ ఏడాది తపస్సు ఏ మేరకు ఫలించనుంది? అన్నదానికి ప్రూఫ్ గా థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు మైత్రి సంస్థ రెడీ అవుతోంది. `షౌట్ ఔట్ లౌడ్!` (బయటికే అరిచెయ్) అంటూ ఈ ట్రైలర్ లాంచ్ కి ఆసక్తికర ట్యాగ్ ని ఇచ్చారు.

`డియర్ కామ్రేడ్` రాక కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్.. పాటలు మెప్పించాయి. ట్రైలర్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది కాబట్టి అన్ని భాషల ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ కానున్నాయి. ఇందులో రష్మిక కథానాయిక. భరత్ కమ్మ దర్శకుడు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్- బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని- రవి శంకర్- మోహన్ చెరుకూరి- యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 26 రిలీజ్ కి మైత్రి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంతో పాటు దేవరకొండ నటిస్తున్న `హీరో`ని అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer