ఫైటర్ గా మారనున్న కామ్రేడ్

0

ఇటీవలే వచ్చిన డియర్ కామ్రేడ్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. గీత గోవిందం తర్వాత ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ అందలేదు. టాక్సీ వాలా పర్వాలేదు అనిపించుకున్నా వసూళ్లు మరీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో రాలేదు. అందుకే ఇప్పుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్న మూవీ మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు.

ఇటీవలే పూరి జగన్నాధ్ తో తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ త్వరలోనే దీని సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న పూరి టీమ్ దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ మసాలా ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. తాజాగా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ తమ బ్యానర్ పేరు మీద ఫైటర్ అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించింది.

ఇది ఖచ్చితంగా విజయ్ సినిమా కోసమేనని ఈజీగా అర్థమవుతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పాతబస్తీ నేపధ్యంలోనే ఇది కూడా సాగుతుందని తెలుస్తోంది. హీరోయిన్లతో పాటు టెక్నీకల్ టీమ్ ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సంగీతం మణిశర్మనే అందిస్తారని టాక్. మొత్తానికి యాటిట్యూడ్ కి విడివిడిగా కొత్త అర్థాలు చెప్పిన విజయ్ దేవరకొండ – పూరిలు కలిసి సినిమా చేయడం అంటే అది ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలైపోయాయి.
Please Read Disclaimer