పంచె కట్టి.. తలపాగా చుట్టి.. మజాక్ చేసిండే

0

రౌడీనా మజాకానా! నిజంగానే దిమాక్ ఖరాబ్ చేసిండు. పంచె కట్టి.. తలపాగా చుట్టి.. మజాక్ చేసిండు. టాలీవుడ్ హిస్టరీలో ఇన్నేళ్లలో వేరొక హీరో చేయనిది దేవరకొండ చేసిండు. అందరిలా గుంపులో గొర్రెలా వెళ్లే టైపు నేను కాదు అని ప్రూవ్ చేసిండు. మందను నడిపించే నేవిగేషన్ నేను అని పక్కాగా ప్రూవ్ చేసిండు. పబ్లిసిటీ అంటే గిట్ట రొటీన్ గా చేస్తే ఎవడు సూసుడు అనుకుండో ఏమో కానీ.. రౌడీ కొండ మాంచి స్పెషల్ గా సేసిండు.

`వరల్డ్ ఫేమస్ లవర్` వైజాగ్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ గెటప్ బిగ్ సర్ ప్రైజ్ ట్రీట్. ఆంధ్రా ఫ్యాన్స్ కి మరోసారి ఇట్టే కనెక్టయిపోయాడు. ఫేమస్ లవర్ మాస్ అవతారాన్ని ఈ వేదికపై ప్రెజెంట్ చేసి కావాల్సిన పబ్లిసిటీ కొట్టేశాడు. పబ్లిసిటీ పరంగా ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో ఆకట్టుకోవడం తన ప్రత్యేకత. ఇంతకుముందు డియర్ కామ్రేడ్ పబ్లిసిటీని ఇదే తీరుగా డిఫరెంటుగా ప్రయత్నించి సక్సెసయ్యాడు. రకరకాల రౌడీ బ్రాండ్ డిజైనర్ దుస్తులతో కిర్రాక్ పుట్టించాడు. అన్ని మెట్రో నగరాల్లో పర్యటించి బోలెడంత పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ కి మరో డిఫరెంట్ పంథాని ఎంచుకున్నాడు. ఈసారి ఏకంగా పంచె కట్టి వేదికపైకి వచ్చాడు.

హీరో అంటే సామాన్యుడికి అందనివాడు కాదు.. మీలో ఒకడిని నేను అని ప్రూవ్ చేసిండు దేవరకొండ. ఇదిగో ఇలా వేదిక దిగువన ఆశీనుడై ఉన్న దేవరకొండ తనకు కాంపిటీషన్ గా వచ్చిన ఓ బుడతడిని ఎత్తుకుని అలా ఎగరేశాడు. ఆ బుడ్డోడి జీన్స్ ఫ్యాంటు.. ఫుల్ హ్యాండ్స్ టీషర్టు.. రెబాన్ కళ్లజోడు చూశాక రౌడీకే పోటీకొచ్చాడని అర్థమవుతోంది. వేదిక వద్ద బోలెడంత ఫన్… ఎంటర్ టైన్ మెంట్. ఫిబ్రవరి 14న రిలీజ్ సందర్భంగా దేవరకొండ తన సినిమా ప్రచారాన్ని ఇలా హోరెత్తించేస్తున్నాడు.
Please Read Disclaimer