కామ్రేడ్ తల్లిని గుర్తించలేదే!

0

మొన్న విడుదలైన డియర్ కామ్రేడ్ మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. వీకెండ్ కాబట్టి ఈ మూడు రోజులు వసూళ్లు రాబట్టినా అసలు పరీక్షరేపటి నుంచే ఉంటుంది. పెట్టుబడులు ఏ మేరకు వెనక్కు వస్తాయనేది సోమవారం నుంచి రికార్డయ్యే డ్రాప్ పర్సెంటేజ్ ని బట్టి ఉంటుంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కు తన తల్లి మాధవి దేవరకొండను తీసుకొస్తూ కొన్ని ఇంటర్వ్యూలలో సైతం భాగం చేశాడు. నిజానికి ఈవిడ సినిమాలో కూడా నటించారు. కాకపోతే అది చిన్న సీన్.

కాలేజీ లెక్చరర్ గా అలా కనిపించి మాయమవుతారు అంతే. ప్రేక్షకులకు ముందే చెప్తే తప్ప గుర్తించడం కూడా జరగని పని. కానీ ఎక్కడా విజయ్ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. అమ్మ తన సినిమాలో ఒక్క సన్నివేశంలో అయినా కనిపించాలన్న కోరికో లేక మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆవిడ ఆసక్తిని వెండితెరవైపు మళ్లించే ప్లానో తెలియదు కానీ మొత్తానికి అబ్బాయి సినిమా అమ్మగారు నటించారు

హీరోల భార్యలు సినిమాల్లో నటించడం చాలాసార్లు చూసిందే గాని ఇలా తల్లులు యాక్ట్ చేయడం చాలా అరుదు. సీనియర్ నరేష్ తో విజయనిర్మల గారు చాలా సినిమాల్లో కనిపించారు. కానీ ఇలాంటి ట్రెండ్ ఆ తర్వాత కనిపించలేదు. యూత్ హీరోల తల్లులు ఒకప్పటి హీరోయిన్లే అయినా తమ పిల్లలతో కలిసి స్క్రీన్ మీద కనిపించే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. అయితే నటనతో అసలు సంబంధమే లేని మాధవి గారిని విజయ్ దేవరకొండ ఇలా ప్రత్యేకంగా స్క్రీన్ మీద కనిపించేలా చొరవ తీసుకోవడం విశేషమే. బిడ్డ ఎదుగుదలను కళ్లారా చూస్తూ అందులో తానూ ఓ భాగం కావడం కంటే తల్లికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది
Please Read Disclaimer