కిరాక్ ప్రమోషన్ ఐడియా వేసిన కామ్రేడ్

0

ఒక సినిమాను ఎంత క్వాలిటీతో తెరకెక్కించినా.. సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నా… సరైన ప్రమోషన్ లేకపోతే చతికిల పడడం ఖాయం. అయితే మంచి ప్రమోషన్ ఉంటె యావరేజ్ సినిమా హిట్టుగా.. హిట్టు సినిమా సూపర్ హిట్టుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జెనరేషన్ ఫిలిం మేకర్లు.. హీరోలు ప్రమోషన్స్ ను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండనే తీసుకుంటే కొత్త కొత్త ప్రమోషన్స్ ఐడియాలతో జనాలను ఆకర్షిస్తున్నాడు.

విభిన్నమైన ఆలోచనలతో సినిమాలను ప్రమోట్ చెయ్యడం విజయ్ స్పెషాలిటి. ఆటోలో తిరుగుతూ ఇంటర్వ్యూ ఇవ్వడం.. టాక్సీ డ్రైవర్ అవతారమెత్తి ప్రయాణీకులను గమ్యానికి చేరుస్తూ వారితో ముచ్చటించడం.. థియేటర్లో ప్రేక్షకులకు ఉచితంగా స్నాక్స్ ఇప్పించడం.. ఇవన్నీ కొత్త తరహా ఐడియాలే. అంతే కాదు తన స్పీచులతో.. యాటిట్యూడ్ తో ఆడియన్స్ కు సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తాడు. ‘గీత గోవిందం’ సమయంలో ‘వాట్ ది ఎఫ్’ సాంగ్ ku తన వాయిస్ సూట్ కాకపోవడంతో నెటిజన్ల చేత ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆ ట్రోలింగ్ ను కూడా ప్రస్తావించి.. తనపై తాను జోకులు వేసుకొని అందరినీ మెప్పించాడు. తన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ కోసం ఇప్పుడు మరో విభిన్నమైన ఐడియాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ పేరుతో మ్యూజిక్ ఈవెంట్లు చేసేందుకు ప్లాన్ చేశాడు విజయ్. హైదరాబాద్.. బెంగళూరు.. కొచ్చి.. చెన్నై.. వైజాగ్ నగరాల్లో ఈ మ్యూజిక్ ఈవెంట్ లు జరుపుతారట. ఓపెన్ గ్రౌండ్స్ లో ఈ మ్యూజిక్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని.. పాటలతో.. డ్యాన్సులతో అభిమానులను మురిపించడంతో పాటు ఒకేసారి సినిమా ప్రమోషన్ కూడా చేస్తారు. లొకేషన్ డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తామని.. అభిమానులు.. ప్రేక్షకులు ఈ మ్యూజిక్ ఈవెంట్స్ కు హాజరుకావాలని తనదైన స్టైల్ లో పిలుపునిచ్చాడు. ఇక బెంగుళూరులో జరిగే మ్యూజిక్ ఈవెంట్ కు యష్ హాజరవుతాడట. ఏదేమైనా కామ్రేడ్ కు కత్తిలాంటి ఐడియాలు వస్తాయి కదా?
Please Read Disclaimer