రౌడీగారి ఫోకస్ ఆ సినిమాపై తక్కువగా ఉందట!

0

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మరో పది రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. విజయ్ ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి క్రాంతి మాధవ్ సినిమా కాగా మరొకటి ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరక్కుతున్న ‘హీరో’.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్ టైటిల్డ్ ఫిలిం ను పోయినేడాది అక్టోబర్ లో లాంచ్ చేయడం జరిగింది.. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటివరకూ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయట. షూటింగ్ ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలైనా 30% షూటింగ్ మాత్రమే పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోందట. ‘డియర్ కామ్రేడ్’ కారణంగా విజయ్ ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ చెయ్యడం లేదని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. మరి ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్.. ప్రమోషన్స్ హడావుడి ముగిసిన తర్వాత విజయ్ ఈ సినిమాపై ఫోకస్ చేసి మిగతా షూట్ ను వేగంగా పూర్తి చేస్తాడేమో చూడాలి. అయితే ఈ సినిమాతో పాటుగా ఆనంద్ అన్నామలై ‘హీరో’ కూడా సెట్స్ పైన ఉంది కాబట్టి రెండు సినిమాల షూటింగ్ కు విజయ్ తన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఒకవేళ విజయ్ కనుక ‘హీరో’ సినిమాకు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చిన పక్షంలో క్రాంతి మాధవ్ సినిమా మరింత డిలే అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

అయితే ఫ్యాన్స్ కు ఈ షూటింగ్ షెడ్యూల్స్ గోలతో సంబంధం లేకుండా రెగ్యులర్ గా విజయ్ సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉండాలి. ‘డియర్ కామ్రేడ్’ ఎలాగూ ఈ నెలలో రిలీజ్ అవుతోంది కాబట్టి మరో ఆరు నెలల గ్యాప్ వచ్చినా వెయిట్ చేస్తారు. ఆ లోపు క్రాంతి మాధవ్ ఫిలిం లేదా ఆనంద్ అన్నామలై మూవీతో గానీ విజయ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమే.
Please Read Disclaimer