స్టార్ డమ్ నమ్మనంటూనే ఆ సినిమాల్ని చేయడట!

0

మాట చెబితే అతికేలా ఉండాలి. ఎందుకో కాని విజయ్ దేవరకొండ మాటల్లో తేడా కొట్టేస్తున్నాయి. ఒక మాటకు.. మరో మాటకు అతకని రీతిలో ఉంటున్న అతడి మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెర మీద విజయ్ మాటలే కాదు.. రియల్ లైఫ్ లో తన మాటలతో మనసుల్ని దోచుకోవటమే కాదు.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ.

తాజాగా అతగాడు చెప్పే మాటలు లెక్క తప్పేలా ఉండటం గమనార్హం. స్టార్ డమ్.. ఇమేజ్ లాంటి వాటిని తాను నమ్మనని చెప్పే విజయ్.. అందుకు భిన్నమైన వ్యాఖ్యల్ని చేశాడు. రాత్రికి రాత్రే ఏమైనా జరగొచ్చంటూ.. గతానికి ఇప్పటికి తాను కథలు ఎంపిక చేసుకోవటంలో తన ఆలోచనలు మారినట్లు చెప్పారు.

ఇప్పుడైతే పెళ్లి చూపులు లాంటి సినిమాలు చేయలేనని.. అంతకంటే ఎక్కువ స్పాన్ ఉన్న సినిమాలు చేసే అవకాశం దక్కిందంటున్నాడు. విజయ్ మిస్ అవుతున్న విషయం ఏమంటే.. తానీ పొజిషన్ కు రావటానికి పెళ్లి చూపులేనని.. అదే అర్జున్ రెడ్డికి అవకాశం ఇచ్చిన విషయాన్ని మర్చిపోవటం గమనార్హం.

ఇండస్ట్రీలో అంతమంది హీరోలు ఉన్నప్పుడు మరో కొత్త హీరోగా గుర్తింపు ఇచ్చింది పెళ్లిచూపులు మూవీనే. అలాంటి సినిమాను విజయ్ ఇప్పుడు చేయనంటున్నాడంటే.. మరో విజయ్ దేవరకొండ తెర మీదకు వచ్చేందుకు అవకాశం ఇస్తున్నట్లే. ఎప్పటికప్పుడు కొత్త స్టార్టు ఎందుకొస్తారో అర్థమైందా?
Please Read Disclaimer