కామ్రేడ్ ముద్దు పెడుతుంటే.. మీకలా అనిపించాలంతే!

0

సినిమాలకు సంబంధించి నటీనటులకు కొన్ని ప్రశ్నలు రోటీన్ గా వస్తుంటాయి. అదేం సిత్రమో.. జర్నలిస్టులకు ఎలా అయితే రోటీన్ ప్రశ్నలు కామనో.. యాక్టర్లు.. సెలబ్రిటీలకు కొన్ని సమాధానాలు ఇన్ స్టెంట్ గా రెఢీగా ఉంటాయి. మీ అందానికి రహస్యమంటే.. అది మా అమ్మ వరమని.. తల్లిదండ్రుల వరమని చెప్పేటోళ్లు బోలెడంతమంది కనిపిస్తుంటారు. ఇక.. సిక్స్ ప్యాక్ మీద.. బికినీ మీదా.. ప్రేమ మీద.. పెళ్లి మీదా చాలామంది ఒకేలాంటి సమాధానాలు చెబుతుంటారు. కాకుంటే.. కాస్త అటుఇటూ తిప్పుతుంటారంతే.

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. మిగిలినవారికి కాస్త భిన్నంగా ఉంటారు. కాస్తంత సెన్సిబులిటీ.. మరికాస్త సెన్సిటివిటీ విజయ్ సొంతం. మొన్నటి వరకూ సామాన్యుడినన్న ఫీలింగ్ నేటి సెలబ్రిటీ అయ్యాక కూడా పోని తత్త్వం పలువురిని అతనికి ఫ్యాన్ అయ్యేలా చేస్తుంది. తనను చూడటం కోసం తపించే అభిమానులకు చిన్న కష్టం వచ్చినా కళ్ల వెంట కన్నీళ్లు కారిపోతుంటాయ్.

మిగిలిన వారికి కాస్త భిన్నంగా వ్యవహరించే విజయ్ లాంటోడ్ని.. ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో కలిగే ఫీలింగ్స్ గురించి అడిగితే అతగాడి సమాధానం మీరే మాత్రం ఊహించలేరు. తాజాగా ముద్దు సన్నివేశాల మీద అడిగిన ప్రశ్నకు విజయ్ చెప్పిన ఆన్సర్ ఏమిటో తెలుసా?

సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఆయా పాత్రల భావోద్వేగం.. అక్కడ ఆ పాత్రలెలా ప్రవర్తిస్తున్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలే కానీ.. అలాంటి సన్నివేశాల్లో ఆ పాత్రల్ని పోషించే వారు కనిపించకూడదన్నారు. తాజాగా తాను నటించి.. విడుదలకు సిద్ధంగా ఉన్న డియర్ కామ్రేడ్ మూవీ విషయానికే వస్తే.. ఈ సినిమాలో తాను కిస్ సీన్ చేసేటప్పుడు.. ముద్దు పెడుతున్నది విజయ్ గా కనిపించకూడదు. బాబీ కనిపించాలన్నాడు.

కథలను బట్టి..ఆయా పాత్రలకు అనుగుణంగానే సినిమాలో ముద్దు సీన్లు ఉంటాయే తప్పించి.. అలాంటి సీన్లతోనే సినిమాలు హిట్ కావని స్పష్టం చేశాడు. మిగిలిన సంగతిని పక్కన పెడితే.. కామ్రేడ్ ముద్దు పెట్టేప్పుడు మీకు కాని బాబీ కాకుండా విజయ్ ఎంతమాత్రం కనిపించకూడదు. తెలిసిందా? సో.. సినిమా విడుదలకు కొద్ది రోజులు టైం ఉంది కాబట్టి.. అప్పటిలోపు అలా ఫిక్స్ అయిపోండి. ఓకేనా?
Please Read Disclaimer