స్టైల్ పేరుతో రౌడీస్టార్ క్రేజ్ తగ్గించుకుంటున్నాడా?

0

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో స్థాయిని దక్కించుకున్నాడు. గీత గోవిందం చిత్రంతో తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. హీరోగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు స్టైల్ ఐకాన్ గా కూడా విజయ్ దేవరకొండకు పేరు వచ్చింది. చాలా ట్రెండీగా.. స్టైల్ గా డ్రస్సింగ్ అవుతాడు అంటూ ఆమద్య ఒక అవార్డు కూడా వచ్చింది. తనను స్టైలిష్ గా అభిమానులు చూడాలనుకుంటున్నారనే ఉద్దేశ్యంతో విజయ్ దేవరకొండ మరింత స్టైలిష్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏదైనా స్పెషల్ షో లో కనిపించినా కూడా అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ వస్తున్నాడు. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ కొన్ని సార్లు విమర్శల పాలవుతుంది. స్టైల్ పేరుతో మరీ అతి చేస్తున్నాడనే విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. మరోసారి విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆయన డ్రస్ ను అరబ్బు షేకుల డ్రస్ తో కంపైర్ చేస్తూ కామెడీ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తాను నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రమోషన్ కోసం నువ్వే హీరో.. అనే ప్రమోషనల్ సాంగ్ చేశాడు. ఆ పాటలో విజయ్ దేవరకొండ వేసుకున్న డ్రస్ గురించి ప్రస్తుతం రకరకాలుగా మీమ్స్ వస్తున్నాయి. స్టైల్ పేరుతో మరీ ఇలాంటి డ్రస్ లు వేయడం ఏంటీ రౌడీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు ఇదేం స్టైల్ బాసూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ వైట్ డ్రస్ గురించిన ట్రోల్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టైల్ పేరుతో తనకున్న క్రేజ్ ను ఈ హీరో తగ్గించుకుంటున్నాడనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి నుండైనా కాస్త అల్ట్రా మోడ్రన్ స్టైల్ ను తగ్గించాలని స్వయంగా ఆయన అభిమానులు కోరుతున్నారు.
Please Read Disclaimer