ఆమెకు గిఫ్ట్ ఇచ్చి తప్పుగా అనుకోవద్దన్న రౌడీ

0

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీకి విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు చెబుతూ ఒక గిఫ్ట్ ను కూడా పంపించాడు. విజయ్ దేవరకొండ పంపించిన గిఫ్ట్ ను కియారా అద్వానీ స్వీకరించి కృతజ్ఞతలు చెప్పింది. విజయ్ దేవరకొండ గిఫ్ట్ తో పాటు.. కంగ్రాట్స్ ఫర్ కబీర్ సింగ్ సక్సెస్ కియారా. ఈ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేయ్. అలాగే ఈనా గిఫ్ట్ ను కూడా స్వీకరించు. ఇలా నీకు గిఫ్ట్ పంపడం తప్పేమో అనిపిస్తుంది. కాని నువ్వు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి. అందుకే నీకు ఈ గిఫ్ట్ పంపిస్తున్నాను అంటూ ఒక డిజైన్డ్ డ్రస్ ను కియారాకు గిఫ్ట్ గా రౌడీ పంపించాడు.

విజయ్ దేవరకొండ గిఫ్ట్ మరియు సక్సెస్ శుభాకాంక్షలను అందుకున్న కియారా స్పందిస్తూ.. నీ గిఫ్ట్ మరియు శుభాకాంక్షలకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చింది. కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ కు జంటగా నటించిన కియారా అద్వానీకి మంచి గుర్తింపు వచ్చింది. నటిగా ఈ చిత్రంతో మరో మెట్టును కియారా ఎక్కిందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన కెరీర్ లో ఒక మంచి సినిమా అంటూ కియారా ఆనందం వ్యక్తం చేసింది.

ఇక కబీర్ సింగ్ గురించి విజయ్ దేవరకొండ ఒకానొక సందర్బంలో మాట్లాడుతూ… సినిమా విడుదల సమయంలో నేను ఫ్రాన్స్ లో ఉన్నాను. షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన వెంటనే జ్వరం కారణంగా సినిమాను చూడలేక పోయాను. నా మిత్రుడు తీసిన ‘కబీర్ సింగ్’ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి నాకు చాలా ఉందన్నాడు. విడుదలైన మొదటి రోజు నెగటివ్ రివ్యూలు వచ్చినా కూడా సినిమాకు మాత్రం మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. 5 రోజుల్లో 100 కోట్లు వసూళ్లు చేసిన కబీర్ సింగ్ ఇప్పటికే 165 కోట్ల వరకు రాబట్టిందని తెలుస్తోంది. లాంగ్ రన్ లో 200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు.
Please Read Disclaimer