లైఫ్ అంటూ ఎమోషన్ అయ్యాడు!

0

దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. దేవరకొండ అభిమానులు పిచ్చిగా కనెక్టయ్యామని పొగిడేస్తున్నా.. ఈ సినిమా సెకండాఫ్ మిస్టేక్స్ ని క్రిటిక్స్ ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ విమర్శించారు. కథాగమనం విషయంలో కొన్ని తప్పులు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే నేటి బ్లాక్ బస్టర్ మీట్ లో దేవరకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి ఏడాదిగా ఎమోషనల్ గా కనెక్టయ్యి పని చేశానని తెలిపారు. బాబి- లిల్లీ ప్రయాణం ఎలా సాగిందో చూపించాలనే ప్రయత్నం చేశాం. లైఫ్ ని చూపించే క్రమంలోనే రియాలిటీతో సన్నివేశాల్ని మలచాల్సి వచ్చిందని అన్నారు. బాబి- లిల్లీ నాలుగేళ్ల లైఫ్ జర్నీలో ఎన్నో విషయాల్ని తెరపై చూపించామని తెలిపారు. ఇదో బ్యూటిఫుల్ లైఫ్ ఉన్న ఫిలిం. అందరూ థియేటర్లలో చూడండి అంటూ దేవరకొండ అభ్యర్థించారు. ఇక కామ్రేడ్ టీమ్ ని విడిచి వెళుతున్నానని దేవరకొండ వేదికపై ఎమోషన్ అవ్వడం చర్చకొచ్చింది.

“ఈ సినిమాతో ఎమోషనల్ గా కనెక్టయ్యాను. అందుకే చాలాసార్లు ఏడ్చేస్తుంటే నా స్నేహితులు అందరూ చూసి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగారు. ఎమోషనల్ గా నేను సినిమాకి కనెక్టయ్యి పని చేశాన“ని దేవరకొండ వేదికపై తెలిపారు. నాలుగు రాష్ట్రాల పంపిణీదారులు కొన్నారు అందుకే ప్రచారం అంతగా చేశాను… అని అన్నారు. తెలుగు రాష్ట్రాలు సహా కేరళ-తమిళనాడు-మలయాళంలోనూ బాగా ఆడుతోందని దేవరకొండ తెలిపారు. ఈ వేదికపై కాకినాడ అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కాకినాడలో ఓ సక్సెస్ మీట్ నిర్వహిస్తామని అన్నారు. డియర్ కామ్రేడ్ చిత్రంలో కాకినాడ కుర్రాళ్లు నటించిన సంగతి తెలిసిందే. తప్పుల్ని అంగీకరిస్తూనే కామ్రేడ్ ప్రేక్షకుల్ని అభ్యర్థిస్తున్న తీరు ఆకట్టుకుంది.
Please Read Disclaimer