ఆయన చేసిన సినిమాలు నా వల్ల కాదు !

0

నిన్న జరిగిన ‘కౌసల్య కృష్ణ మూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎటెండ్ అయ్యాడు విజయ్ దేవేరకొండ. స్టేజి మీద కొంత సేపు తన మాటలతో మేజిక్ చేసాడు. నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి – అలాగే నిర్మాత కే. ఎస్. రామారావు గురించి స్పీచ్ ఇచ్చాడు. మధ్యలో ఐశ్వర్య రాజేశ్ పై కొంత ప్రేమను చూపించాడు.

ఈ వేదికపై విజయ్ గురించి మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకు విజయ్ స్పందిస్తూ ముందుగా థాంక్యూ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మీరు చేసిన సినిమాలు – క్యారెక్టర్స్ నా లైఫ్ టైంలో చేయలేనేమో. ఇప్పుడు అది నా వల్ల కానీ పని. మీలాంటి పెద్దవాళ్ళు మమ్మల్ని గురించి మా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇది నా సినిమా కాదు. ఈవెంట్ కి రావడానికి ముఖ్య కారణం వీళ్లంతా మా టీమ్. కే. ఎస్. రామారావు గారి బ్యానర్ లో సినిమా చేస్తున్నాను. అందుకే వీళ్ళ కోసం మా షూటింగ్ ఫ్యాకప్ చేసుకొని ఐశ్వర్య గురించి వచ్చాం. రామారావు గారిని పెళ్లి చూపుల తర్వాత కలిశా. అప్పుడు ఆయన క్రాంతి మాధవ్ గారు పెళ్లి చూపులు నచ్చి మనం సినిమా చేద్దామని ఒక కథ చెప్పారు. అదే ఇప్పుడు షూట్ చేస్తున్నాం.

ఇక సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కి ఐశ్వర్య రాజేష్ ని తీసుకోవడం జరిగింది. ఆమె నటించిన తమిళ్ సినిమాలు కొన్ని నేను మా ఫ్రెండ్స్ చూసాం. ఆమె వర్క్ నచ్చింది. తనతో ఇప్పుడు సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మేం కలిసి చేసిన కొత్తగూడెం షూట్ బాగా ఎంజాయ్ చేసాం. ఇక నిర్మాత రామారావు గారికి సినిమానే ప్రపంచం. ఆయనకన్నీ సినిమానే. ఎప్పుడూ సెట్ లో ఉంటారు.మాకు ఏం కావాలో అది అందించడమే ఆయన పని అంటారు. రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా అన్నాడు.
Please Read Disclaimer