రౌడీ ఏంటి బాంబేలో డాన్ లా దిగాడు!

0

కామ్రేడ్ విజయ్ దేవరకొండ ప్రచారార్భాటం తెలిసిందే. మ్యూజిక్ ఫెస్టివల్స్ పేరుతో మెట్రో నగరాలన్నీ చుట్టేస్తున్నాడు. ప్రతిచోటా గాళ్స్ అతడిని చుట్టేస్తున్నారు. హైదరాబాద్- బెంగళూరు- చెన్నయ్ ప్రతిచోటా ఇదే సన్నివేశం ఎదురైంది. హైదరాబాద్ జేఆర్సీలో జరిగిన ఈవెంట్లో విజయ్ దేవరకొండ వేదిక లేడీ ఫ్యాన్స్ తో ఊగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ వేదికపై విజయ్ లుక్ కూడా ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.

స్టూడెంట్ లుక్ అంటే మామూలుగా ఉంటుందా? పైగా స్టూడెంట్ ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) లీడర్ కాబట్టి అందుకు తగ్గట్టే గెటప్ ని పూర్తిగా ఛేంజ్ చేశాడు కామ్రేడ్ దేవరకొండ. ఒక పొడవాటి లాంగ్ కోట్ ని తలపించిన అల్ట్రా మోడ్రన్ జాకెట్ ని అతడు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేశాడని అర్థమైంది. ఒక పాప్ స్టార్ ని మించి దేవరకొండ గెటప్ ఆకట్టుకుంది. ఆ వేదికపై థీమ్ సాంగ్ పెర్ఫామెన్స్ కట్టి పడేసింది.

లేటెస్టుగా ముంబైలో అడుగుపెట్టాడు కామ్రేడ్. అక్కడ విమానాశ్రయంలో కెమెరాల ఫ్లాష్ లు మెరుపులు మెరిపించాయ్. ఆ ఫోటోల్లో దేవరకొండ లుక్ మైండ్ బ్లోయింగ్. వైట్ టీస్ పై బ్లాక్ బాంబర్ జాకెట్ కాంబినేషన్ తో డాన్ లా దిగాడు. రౌడీ బరిలో దిగితే ముంబై అయినా షేకవ్వాలే! అన్నట్టే ఉందా లుక్. అసలే గుబురు గడ్డం లాంగ్ హెయిర్ స్టైల్ తో కామ్రేడ్ లుక్ ఫుల్ స్ట్రైకింగ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రిలీజై ఈ కొత్త లుక్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 26న డియర్ కామ్రేడ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సినిమాకి సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. తెలుగు-తమిళం-కన్నడం-మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. పొరుగు భాషల్లో దుల్కార్- విజయ్ సేతుపతి వంటి స్టార్లతో ప్రచారం చేయిస్తున్నాడు. అర్జున్ రెడ్డి.. గీత గోవిందం.. టాక్సీవాలా.. ఇవన్నీ బ్లాక్ బస్టర్లు. ఆ కోవలోనే మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer