ఇది తెలిస్తే రౌడీకి మీరు ఫిదానే..

0

ఇమేజ్ బిల్డింగ్ అంత చిన్న కతేం కాదు. టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నా.. ఒక పద్దతి ప్రకారం ఇమేజ్ పెంచుకునే విషయంలో మాత్రం వెనుకబడే ఉంటారని చెప్పాలి. కానీ.. ఇలాంటి తెలివి మాత్రం సంచలన హీరో విజయదేవరకొండ దగ్గర టన్నుల టన్నుల లెక్కన ఉంది. ఒకట్రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన వెంటనే ఆకాశంలో తిరుగుతూ వచ్చిన ఇమేజ్ ను పాడు చేసుకోవటం ఇప్పటివరకూ ఇండస్ట్రీలో చాలామందిని చూశాం. కానీ.. విజయదేవరకొండ ఆ టైప్ కాదు.

పావలా ఇమేజ్ ను రూపాయి పావలాగా ఎలా మార్చుకోవాలో మనోడికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. ఈ కారణంతోనే.. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ ఇప్పుడు క్రేజ్ పెంచుకోవటమే కాదు.. తనను తాను హాట్ స్టార్ గా మలుచుకుంటున్న వైనం చూస్తే ముచ్చటపడాల్సిందే. క్రిస్మస్ వస్తే శాంటాక్లాజ్ అందరికి గుర్తుకు వస్తాడు.

తెలిసిన వారో.. లేదంటో ఇంట్లో వారు మాత్రమే పిల్లలకు శాంటా పేరుతో బహుమతులు ఇస్తారు. సోషల్ మీడియాను మాధ్యమంగా చేసుకొని #Deverasanta పేరుతో.. మీకేం బహుమతులు కావాలో కోరుకుండి. అందులో ఒక పది మందికి నేనుబహుమతులు ఇస్తానని ప్రకటించిన విజయ్ దేవర కొండ ప్రకటన భారీ సక్సెస్ కావటమే కాదు.. తనకొచ్చిన గిఫ్ట్ రిక్వెస్టులను పరిశీలించి.. అందులో నుంచి కొందరిని ఎంపిక చేసుకొని వారికి బహుమతులు ఇస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఒక అభిమానికి మ్యాక్ బుక్ ప్రో కావాలని అడిగితే.. అతగాడి రిక్వెస్టును మన్నించి.. అతడి పాలిట దేవరశాంటాగా మారి.. అతడింటికి తన సోదరుడి చేత మ్యాక్ బుక్ ప్రోను పంపిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన అభిమాన నటుడి సోదరుడే స్వయంగా తన ఇంటికి వచ్చి తాను కోరిన మ్యాక్ బుక్ ను బహుమతిగా ఇవ్వటంపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడా అభిమాని. ఆనంద్ అన్న మా ఇంటికి వచ్చి మ్యాక్ బుక్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందంటూ అభిమాని శివ శంకర్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఏమైనా.. అభిమానుల్నిఫిదా చేయటం.. వారి మనసుల్ని దోచేసే విషయంలో విజయదేవరకొండను చూసి టాలీవుడ్ అగ్రహీరోలు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.
Please Read Disclaimer