విజయ్ కోరిక తీరాలంటే తారలు దిగిరావలె..!

0

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం రేపిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సినీ ఇండస్ట్రీ పై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మొత్తం సౌత్ – నార్త్ ఇండస్ట్రీలన్నీ అర్జున్ రెడ్డి పై కన్నేశాయి. ఆ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర బాషా అభిమానులను కూడా ఆకర్షించుకున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ పై సినీ అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం మనసు పారేసుకోవడం విశేషం.

అయితే అర్జున్ రెడ్డి – గీతగోవిందం సినిమాల హిట్ల తర్వాత విజయ్ అన్ని చేదు అనుభవాలే మిగిలాయి. రీసెంట్ గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో పెద్ద ప్లాప్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. సినతారలు ఇండస్ట్రీలో సెలబ్రిటీ క్రష్ లను బయటపెడుతూ ఉంటారు. ఆ విధంగానే హీరోయిన్లు కియారా అద్వానీ – జాన్వీ కపూర్ లతో నటించాలని ఉన్నట్లు తన కోరికను బయటపెట్టాడు విజయ్.

అదేవిధంగా కియారా – జాన్వీలు కూడా విజయ్ తో నటించడానికి మక్కువ చూపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ సినిమాకోసం ముందే వీళ్ళిద్దరిని ట్రై చేసాడట. కానీ కియారా – జాన్వీలు ఒప్పుకోలేదు. అర్జున్ రెడ్డి సినిమా టైంలో అంటే మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అలా చెప్పి ఉంటారు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు కియారా – జాన్వీలు వరుస సినిమాలతో పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికైతే విజయ్ తో నటించే ఆలోచనను పక్కన పెట్టారంట – ఎందుకంటే గత కొంతకాలంగా విజయ్ వరుస ప్లాపులను మూటగట్టుకున్నాడు. మళ్ళీ ఫామ్ లోకి వస్తేనే ముద్దుగుమ్మలు ఓకే అంటారేమో అని ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

విజయ్ కి ఇప్పుడు అవకాశం ఇచ్చే రేంజ్ లో కియారా – జాన్వీలు లేరని – విజయ్ మళ్ళీ తనని ప్రూవ్ చేసుకొని ఫామ్ లోకి వస్తే ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లేదంటే ప్రెసెంట్ ఫామ్ లో ఉన్న వీరిద్దరూ ప్లాప్ లలో పడితేగాని విజయ్ లెవెల్ కి సరిపోతారేమో అని సినీ అభిమానుల అంచనా. చూస్తుంటే విజయ్ దేవరకొండ కోరిక ఇప్పట్లో తీరేలా లేదుగా అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఒకటి తారలు నేలకు దిగిరావాలే.. లేదా నేలనున్న తార పై స్థాయికి పోవాలే.. అన్న చందంగా ఉంది..
Please Read Disclaimer