విజయ్ రావడానికి కారణం ఇదా?

0

చిన్న సినిమాల ఈవెంట్స్ కి ఎంతో కొంత స్టార్ డం ఉన్న హీరో గెస్ట్ గా వస్తేనే ఆ సినిమాకు కొంత హైప్ వస్తుంది. అప్పటి నుండి ఆ సినిమాపై ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. ఆ హీరో తాలూకు ఫ్యాన్స్ కూడా సినిమాను ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తారు. ఈ రోజు జరగనున్న ‘కౌసల్య కృష్ణ మూర్తి’ కి ఇదే జరగనుంది. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నాడు.

తమిళ్ లో ‘కణా’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ‘శైలజా కృష్ణ మూర్తి’. కే. ఎస్.రామారావు ఈ సినిమాకు నిర్మాత. ఈ బ్యానర్ లోనే నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు విజయ్. అందుకే తన నిర్మాత కోసం ఈ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మారాడు. ముందుగా ఈ ఈవెంట్ కి మెగా స్టార్ ని చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకున్నారు నిర్మాత కే.ఎస్.రామారావు. ఆయనతో చిరుకి మంచి అనుబంధం ఉంది. కాకపోతే ప్రస్తుతం చిరు బిజీగా ఉన్నాడు. అందుకే తన సినిమా హీరో విజయ్ దేవరకొండను అలాగే రాశీ ఖన్నా ను ఈవెంట్ కి గెస్ట్ లుగా ఇన్ వైట్ చేశారు.

విజయ్ ఇప్పుడు ఏది మాట్లాడినా సెన్సేషనే. ఏ మాత్రం డిఫరెంట్ గా స్పీచ్ ఇచ్చినా వీడియో వైరల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోల్లో తన కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తో పాటు భయంకరమైన క్రేజ్ ఉంది. మరి ఈ క్రేజ్ తో ఈ రోజు విజయ్ ఏం మాట్లాడతాడో.. చిన్న సినిమాగా వస్తున్న ‘కౌసల్య కృష్ణ మూర్తి’ ని తన వెర్షన్ లో ఎలా ప్రమోట్ చేస్తాడో చూడాలి. ఈ నెల 23న సినిమా థియేటర్స్ లోకి రానుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home