ఫేమస్ లవర్ గుట్టు మొత్తం లీక్

0

ఆ సినిమాలో హీరో ఒక రైటర్. పెన్ను తో పేపరుపై కథ రాయడం మొదలు పెడతాడుట. ఆ కథలో హీరో విజయ్ దేవరకోండ. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అలా కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో కథ రాస్తోన్న హీరోకి మరో థాట్ వచ్చి అంతవరకూ రాసిన కథను రఫ్ చేసేస్తాడు. మళ్లీ కొత్త కథ ప్రారంభిస్తాడు. ఈసారి కూడా కొత్త కథలో హీరో దేవరకొండనే. కానీ హీరోయిన్ మాత్రం మారుతుంది. ఐశ్యర్య స్థానంలో క్యాథరీన్ థ్రెసా వస్తుంది. ఇంతకీ ఈ కథ రాస్తోంది ఎవరో తెలుసా? అదీ కూడా విజయ్ దేవరకొండనే. ఇంట్రెస్టింగ్ కదూ? వినేందుకే ఉత్కంఠ పెంచుతోంది. మరి తెరపై ఎలా కనిపిస్తోందో కానీ వరల్డ్ ఫేమస్ లవర్ థీమ్ ఇప్పటికే వైరల్ అయిపోతోంది. ఇది నాలుగు కోట్ల తో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ స్టోరీ అని ఓ టాక్ సోషల్ మీడియా లో స్ప్రెడ్ అవుతోంది.

ఇది ఓ ప్రెంచ్ సినిమాకి ప్రీమేక్ అనే మరో ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. మరి ఇందులో ఎంత నిజం దాగి ఉంది అన్నది తెలియాదు గానీ! ఈ వార్త మాత్రం సోషల్ మీడియా సహా..రౌడీ స్టార్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే కథ అయితే దానికి దర్శకుడు క్రాంతి మాధవ్ తనదైన సెన్సిబిలిటీస్ కమర్శియాలిటీని అద్ది సినిమా తీసి ఉంటాడని భావించవచ్చు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత అభిమానుల్లోకి మెరుపు వేగంగా దూసుకుపోయిన టైటిల్ కూడా `వరల్డ్ ఫేమస్ లవర్` కావడం విశేషం. సహజంగా క్రాంతి మాధవ్ సినిమాలంటే హీరోయిన్లను హద్దు మీరి చూపించడు.

వరల్డ్ ఫేమస్ లవర్ కోసం హీరోయిన్ల విషయంలో కాస్త బార్డర్ దాటినట్లే కనిపిస్తోంది. నలుగురు నాయికలతో రౌడీగారి రొమాన్స్ పీక్స్ లోనే ఉంది మరి. ఇక ఇందులో గ్లామర్ ఎలివేషన్ కి ఆస్కారం ఉంది. అందుకే హీరోయిన్ల తో గ్లామర్ విందు చేయిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. మరి లీకైన స్టోరీ ఎంతవరకూ నిజం? రౌడీ స్టార్ రొమాంటిక్ విశేషాల వెనుక అసలు కథ ఏమిటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని కె.ఎస్ రామారావు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer