విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్లకు అందని క్రేజ్!

0

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్లకు అందఒకే ఒక్క హిట్ విజయ్ దేవరొకండ కు స్టార్ స్టేటస్ తెచ్చిన సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు. అంతకు ముందు ఉన్న గుర్తింపుతో పోలిస్తే అర్జున్ రెడ్డితో దక్కించుకున్న గుర్తింపు చాలా ఎక్కువ. ఆ తర్వాత తెలుగులో ‘గీతాగోవిందం’ కూడా విజయ్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే విజయ్ దేవరకొండకు తెలుగులో వరసగా రెండు ఫ్లాపులు వచ్చాయి.

‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’ రూపంలో విజయ్ దేవరకొండకు ఇబ్బందికరమైన సినిమాలు వచ్చాయి. ఆ పై నిర్మాతగా చేసిన ప్రయత్నమూ సఫలం కాలేదు. ఇక విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాల్లో ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. ఆ రెండు సినిమాలూ ఇప్పటి వరకూ పెద్దగా బజ్ తీసుకురావడం లేదు.

ఇదంతా ఒక సంగతి అయితే బాలీవుడ్ లో మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ లోనే కొనసాగుతూ ఉంది. విజయ్ ఇప్పటి వరకూ హిందీలో ఒక్క హిట్టు కూడా కొట్టలేదు! ఇతడి సినిమాలు అనువాదాలై అక్కడ విడుదల అయ్యింది కూడా లేదు. అయినా బాలీవుడ్ మీడియా విజయ్ దేవరకొండను స్టార్ లా చూస్తూ ఉంది. బాలీవుడ్ స్టార్ల పక్కన కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంది.

తాజాగా ఒక టీవీ షోలో దీపికా పదుకునే రణ్ వీర్ సింగ్ అలియా భట్ వంటి వాళ్లతో పాటు ఆయుష్మాన్ ఖురానా మనోజ్ బాజ్ పాయ్ వంటి ఏ గ్రేడ్ నటీనటులు పాల్గొనగా.. వారితో పాటు విజయ్ దేవరకొండకు ఆ షోలో అవకాశం దక్కింది. ఎలైట్ లీగ్ నటీనటుల సరసన కూర్చుని మాట్లాడటం విజయ్ కు దక్కిన గౌరవమనే చెప్పాలి.

మిగతా టాలీవుడ్ స్టార్ హీరోలకు వారి అభిమానులకు అదేం పెద్దది అనిపించకపోవచ్చు గాక విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు ఉందో మాత్రం ఇలాంటి ఉదంతాలు చాటి చెబుతూ ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ కి బాలీవుడ్ లో జనాల్లో దక్కిన గుర్తింపు ఆ సినిమా హిందీలో రీమేక్ అయ్యి సాధించిన విజయం.. ఇవన్నీ కూడా విజయ్ దేవరకొండకు దక్కుతున్న ఈ ట్రీట్ మెంట్ కు కారణాలని చెప్పవచ్చు. క్రేజ్!
Please Read Disclaimer