కన్ఫ్యూజన్ లో రౌడీ ?

0

రిలీజ్ డేట్ విషయంలో విజయ్ దేవరకొండ అండ్ టీం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అవును విజయ్ లేటెస్ట్ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వలేదు. డిసెంబర్ లో రిలీజ్ అనుకొని సైలెంట్ గా ఉన్నారు. ఇంతలో ఓ అరడజను సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించేయడంతో చేసేదేం లేక కాం అయిపోయారు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ అయిపోయాక అంటే జనవరి ఎండింగ్ లో లేదా ఫిబ్రవరిలో వేద్దామనుకున్నారు. ఇక ఆ డేట్స్ ను కూడా వేరే సినిమాలు కబ్జా చేసేసాయి. అయితే ఇప్పుడు రౌడీ సరైనా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 14 న లవర్స్ డే రోజు రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయి.

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా విజయ్ కి చాలా ఇంపార్టెంట్. డియర్ కామ్రేడ్ తో విజయ్ మార్కెట్ కాస్త డౌన్ అయింది. ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొడితే నెక్స్ట్ ఫైటర్ సినిమాకు హైప్ వస్తుంది. లేదంటే రౌడీ మార్కెట్ మరింత డౌన్ అవ్వడం ఖాయం.
Please Read Disclaimer