ప్రమోషన్ కు రాని హీరో సినిమా మాకెందుకు?

0

నేడు ప్రేక్షకుల ముందుకు రెండు పెద్ద తమిళ సినిమాలు వచ్చాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది విజయ్ నటించిన ‘విజిల్’. తమిళంలో బిగిల్ గా తెరకెక్కిన ఈ చిత్రంను తెలుగులో విజిల్ టైటిల్ తో డబ్ చేసి విడుదల చేశారు. విజయ్ తో రెండు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన అట్లీ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయ్ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి తెలుగు నిర్మాతలు బాగా హైప్ తీసుకు వచ్చేలా ప్రమోషన్స్ చేశారు.

విజిల్ సినిమాను దాదాపుగా 650 థియేటర్లకు పైగా విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదలై మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా పూర్తి ఫలితంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంపై కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన విజిల్ ప్రెస్ మీట్ లో కేవలం చిత్ర దర్శకుడు అట్లీ కుమార్ మాత్రమే హాజరు అయ్యాడు. సినిమా హక్కులు దక్కించుకున్న నిర్మాత హీరో విజయ్ ను రావాల్సిందిగా ఎంత కోరినా కూడా ఆయన ఏవో కారణాలు చెప్పి నో చెప్పాడట.

తెలుగులో ఆయన సినిమా విడుదల చేస్తూ ప్రమోషన్ కు వచ్చేందుకు సమయం ఉండదు. తెలుగు ప్రేక్షకులపై అంతగా ఆసక్తి లేనప్పుడు.. తెలుగులో ఆయనకు అంతగా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని లేనప్పుడు ఎందుకు మేము మాత్రం విజయ్ సినిమా చూడాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

విజయ్ సినిమా తెలుగులో డబ్ అయితే ఆయన ఖచ్చితంగా ప్రమోషన్ కు రావాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రోజు ఖాళీ హైదరాబాద్ కు రాలేనప్పుడు ఆయన సినిమాను చూడాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు విజయ్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్ తదుపరి చిత్రం ప్రమోషన్ కు అయినా హైదరాబాద్ వస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer