సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఉప్పెన ఫస్ట్ లుక్

0

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కమల్ హాసన్ … విక్రమ్ తరహాలో ప్రయోగాలు చేయడంలో సేతుపతి ఉద్ధండుడు. ఇటీవల అతడి సక్సెస్ రేటు అన్ని పరిశ్రమల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం అతడి ప్రత్యేకత. జాతీయ అవార్డుల్ని కొల్లగొట్టాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి` కోసం ఏరికోరి అతడిని ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి చేసింది చిన్న పాత్రనే అయినా తనదైన ముద్ర వేశాడు.

ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ చిత్రం ఉప్పెన లోనూ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ విలన్ గా కనిపించనున్నాడు. తాజాగా అతడి వేషధారణకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. చూడగానే సాధా సీదా షర్ట్ లో కనిపిస్తున్నా ఊళ్లో పెద్ద మనిషిలా ఉన్నాడు. ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ గుప్పు గుప్పు మంటూ సిగరెట్ పొగ వదులుతున్నాడు. లుక్ క్యూరియాసిటీని పెంచింది. ఇక ఇందులో సేతుపతి విలనీ హైలైట్ గా ఉంటుందని ఇప్పటికే ప్రచారం అవుతోంది.

తూ.గో జిల్లాకి చెందిన ఒక సామాన్య మత్స్యకారుని పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ నేటివ్ లవ్ స్టోరీలో కొత్తమ్మాయ్ కృతి శెట్టి కథానాయిక. గోదారి నేటివిటీ లవ్ స్టోరీని తెరపై చూపిస్తున్నారు. అయితే లవ్ స్టోరీలో సేతుపతికి వైష్ణవ్ కి మధ్య వార్ దేనికి? అన్నది తెరపై చూడాల్సి ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుక్కూ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 2 న సినిమా విడుదల కానుంది.
Please Read Disclaimer