విజయ్ సేతుపతిని వాడుకుంటున్నారు!

0

చాలా కాలం కిందటే విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ‘పిజ్జా’ అంటూ అనువాద సినిమాతో అప్పట్లో వచ్చాడు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. అయితే అప్పట్లో మంచి గుర్తింపు రాలేదు. అయితే ఆ తర్వాత చాలా విరామం తర్వాత మణిరత్నం తమిళ సినిమా తెలుగు అనువాదం ‘నవాబ్’తో ఇతడికి మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఇటీవలి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చేసిన పాత్రతో విజయ్ సేతుపతికి మాస్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది. మరి ఇతడు సంపాదించుకున్న గుర్తింపును తెలుగు మూవీ మేకర్లు వీలైనంతగా వాడుకోవాలని భావిస్తున్నట్టుగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి డైరెక్టుగా తెలుగులో నటిస్తున్న సినిమాలు రెండు మేకింగ్ లో ఉన్నాయి.

వాటి సంగతలా ఉంటే.. ఈ నటుడి ఇమేజ్ ను వాడుకోవడానికి కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతూ ఉన్నాయి. ఇటీవలే ‘విజయ్ సేతుపతి’ అంటూ ఒక సినిమా విడుదల అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆ సినిమాను విడుదల చేశారు. అయితే సరైన ప్రమోషన్ కూడాలేకపోవడంతో ఆ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు ‘పిజ్జా -2’ అంటూ ఒక సినిమా వస్తోంది. ఇది విజయ్ సేతపతి తమిళంలో ఎప్పుడో చేసిన సినిమా. ‘పురియాదపుదిర్’ పేరుతో రూపొందిన తమిళ సినిమాను ‘పిజ్జా టూ’ గా విడుదల చేస్తున్నారట. మొత్తానికి విజయ్ సేతుపతి ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా ఉన్నాయి!
Please Read Disclaimer