ఆ సినిమా నుండి తప్పుకున్న విజయ్

0

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమం అవుతున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సేతుపతి ఈ సినిమానుండి తప్పుకున్నాడట.

విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నాడనే విషయం ఇంకా బయటకు రాలేదు. కారణాలు ఏవైనా విజయ్ సేతుపతి ఈ సినిమానుండి తప్పుకోవడం మాత్రం ‘ఉప్పెన’ టీమ్ కు షాకే. ఈ సినిమాలో సేతుపతి ఉండడంతో ప్రేక్షకులతో పాటుగా ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి వ్యక్తం అయింది. మరి ‘ఉప్పెన’పై నెలకొన్న ఆ క్రేజ్ ను కంటిన్యూ చేసేందుకు సేతుపతి పాత్రలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాకు ఇలా ఆదిలోనే అడ్డంకులు రావడం నిరాశపరిచే విషయమే. గోదావరి నేపథ్యంలో తెరకెక్కుతున్న రస్టిక్ ఫీల్ ఉండే ఇంటెన్స్ లవ్ స్టొరీ ఇది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
Please Read Disclaimer