విదేశీ క్రికెటర్ పాత్రలో విజయ్ సేతుపతి?

0

తమిళ నటుడు విజయ్ సేతుపతి దగ్గరకు ఒక క్రేజీ ప్రాజెక్ట్ వచ్చిందట. ప్రతిభావంతుడైన నటుడిగా పేరున్న విజయ్ కు ఒక క్రికెటర్ పాత్ర పోషించే అవకాశం వచ్చిందని సమాచారం. అది శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మరళీధరన్ బయోపిక్!

ఆ సినిమాకు ‘800’ గా నామకరణం చేశారట. ముత్తయ్య టెస్టుల్లో సాధించిన వికెట్ల నంబర్ తో ఈ సినిమాను రూపొందిస్తారట. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారట. శ్రీలంకతో పాటు ఇండియా – ఇంగ్లండ్ తదితర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేయాలని నిర్ణయించారట. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఎంతో ప్రత్యేకతను కలిగిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను అలా గ్రాండ్ గా రూపొందిచనున్నారట.

అందులో మురళీ రోల్ ను విజయ్ సేతుపతితో చేయించాలని భావిస్తున్నారట ఆ మూవీ మేకర్లు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. విజయ్ సేతుపతి కూడా ఈ విషయంలో స్పందించలేదు. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నట్టుంది. ముందు ముందు పట్టాలెక్కుతుందేమో!
Please Read Disclaimer