బన్నీ-సుక్కు సినిమాకు స్టార్ విలన్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే సుకుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ప్రారంభం కానుంది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సుకుమార్ సంప్రదింపులు జరుపుతున్నారట. విజయ్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లో ఒక కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కొత్త మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిలిం ‘ఉప్పెన’లో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు సుక్కు-బన్నీ ఫిలిం లో కూడా మెయిన్ విలన్ గానే విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారని అంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే తమిళనాట కూడా ఈ సినిమాకు క్రేజ్ నేలకొంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. చాలాకాలంగా తమిళ మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు కానీ ఇప్పటివరకూ ప్రయత్నాలు మాత్రం చెయ్యలేదు. ఆ దిశగా ఈ సినిమా మొదటి ప్రయత్నం అయ్యే ఛాన్స్ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Please Read Disclaimer