అంతసేపు విజయ్ ని చూస్తారా?

0

దసరా పండగ హడావిడి సైరాతో ముగిసిపోయింది. ఇక రానుంది దీపావళి. కేవలం ఒక్క రోజు మాత్రమే సెలవు దొరికే ఈ టపాసుల ఫెస్టివల్ ని టాలీవుడ్ లైట్ తీసుకుంటుంది కాని కోలీవుడ్ లో మాత్రం సంక్రాంతి రేంజ్ హడావిడి ఉంటుంది. అందులోనూ దళపతి విజయ్ సినిమా అంటే చెప్పేదేముంటుంది. తేరి-మెర్సల్ తో విజయ్ కు రెండు మసాలా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఆట్లీ రూపొందించిన హ్యాట్రిక్ మూవీ బిగిల్ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీన్ని మహేష్ కోనేరు తెలుగులో విజిల్ పేరుతో అందిస్తున్నారు.

ఇప్పటికే ట్రైలర్ హిట్ అయిపోయింది. తాజాగా ఒరిజినల్ వెర్షన్ తాలుకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. నిడివి 179 నిమిషాలకు లాక్ చేశారు. అంటే 3 గంటలకు ఒక్క నిమిషం తక్కువ. విజయ్ ఇమేజ్ కు తమిళ్ లో ఇంతసేపు విజయ్ ని చూస్తారేమో కాని తెలుగులో పెద్దగా మార్కెట్ లేని ఇతన్ని అంతసేపు తెరమీద చూడటం మీద అనుమానాలు లేకపోలేదు. విజయ్ సినిమాలన్నీ సాధారణంగా ఇంతే లెంత్ తో ఉంటాయి. మన దగ్గర ఆడకపోయినా విజయ్ డబ్బింగ్ వెర్షన్లన్ని నిర్మాతలు కట్ చేయకుండానే విడుదల చేశారు.

ఇప్పుడు విజిల్ విషయంలోనూ అదే రిపీట్ కావొచ్చు. అయితే యాడ్స్ – ఇంటర్వెల్ తో కలిపి సుమారు మూడున్నర గంటలు ప్రేక్షకులు ధియేటర్లోనే గడపాల్సి వస్తుంది. ఫుట్ బాల్ కోచ్ గా ఊర మాస్ లీడర్ గా రెండు షేడ్స్ చేస్తున్న విజయ్ అంతసేపు కట్టిపడేసే మాయాజాలం ఏం చేసుకుంటాడో వేచి చూడాలి. రిలీజ్ డేట్ మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించబోతున్నారు. రెండు వందల కోట్లకు పైగా టార్గెట్ తో బరిలో దిగుతున్న బిగిల్ కు తెలుగులో మాత్రం ఆశించిన బజ్ లేదు. దీనికి సంబంధించి నిర్మాతల దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో
Please Read Disclaimer